Stock Market: లాభాల్లో ముగిసిన దేశీ స్టాక్ మార్కెట్లు
Stock Market: రెండు రోజుల విరామం తరువాత లాభాల బాట * సరికొత్త గరిష్టాలను నమోదు చేసిన కీలక సూచీలు
Representational Image
Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. రెండు రోజుల విరామం తరువాత కీలక సూచీలు సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 52 వేల స్థాయికి చేరుకోగా.. నిఫ్టీ ఫిఫ్టీ 15,690 పాయింట్ల ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 382 పాయింట్లు ఎగసి 52,232 వద్దకు చేరగా, నిఫ్టీ 114 పాయింట్ల మేర లాభంతో 15,690
వద్ద స్థిరపడ్డాయి.లాక్‌డౌన్ ఆంక్షలతో దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో వేగంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే అంచనాలు బుల్లిష్ సెంటిమెంట్‌కు దారి తీసిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.