Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. వరుసగా ఎనిమిదో రోజు నష్టాలు
Stock Market: వరుసగా ఎనిమిదో రోజు నష్టాలు
Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌ను నష్టాలు వెంటాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో మొదలైన దేశీయ సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా ఒడిదుడుకులకు లోనయై నష్టాలను మూటగట్టుకున్నాయి. జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మెటల్ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.
స్టాక్ మార్కెట్లలో డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. మార్కెట్ ప్రారంభమైన కాసేపటికే నష్టాల బాట పట్టడంతో మార్కెట్ ముగిసే సమయానికి నష్టాలోకి జారుకుంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 326 పాయింట్లు నష్టపోయి 58 వేల 962కి పడిపోయింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 17 వేల 303 వద్ద స్థిరపడింది.