Equity Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల ముగింపు
Equity Market: గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యం * సెన్సెక్స్ 111 పాయింట్లు లాభపడి 50,651 వద్ద క్లోజ్
Representational Image
Equity Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి..గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యంలో దేశీ స్టాక్ సూచీలు సానుకూల ధోరణిన ట్రేడింగ్ ప్రారంభించి.. లాభాలతో ముగించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 111 పాయింట్లు లాభపడి 50,651 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు ఎగబాకి 15,197 వద్ద స్థిరపడ్డాయి. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతుండడంతో పాటు, వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచే యత్నాలు వేగవంతం కావడంతో సానుకూల సెంటిమెంటు మెరుగుపడిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.