Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: 127 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ * 13 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు(ఫోటో-ది హన్స్ ఇండియా )
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు చివరి వరకు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు నష్టాలబాట పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 127 పాయింట్లు నష్టపోయి 58వేల 177కి పడిపోయింది. నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 17వేల 355 వద్ద స్థిరపడింది.