Business Idea: తక్కువ ఇన్వెస్ట్‌తో బెస్ట్‌ బిజినెస్‌లు.. జాబ్‌ చేస్తే వచ్చే సాలరీ కంటే ఎక్కవ ఇన్‌కమ్‌..!

Business Idea: కొంతమంది తక్కువ జీతానికి ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలిచాలని డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు.

Update: 2023-07-20 06:07 GMT

Business Idea: తక్కువ ఇన్వెస్ట్‌తో బెస్ట్‌ బిజినెస్‌లు.. జాబ్‌ చేస్తే వచ్చే సాలరీ కంటే ఎక్కవ ఇన్‌కమ్‌..!

Business Idea: కొంతమంది తక్కువ జీతానికి ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలిచాలని డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు. అనుకోని ఆపద వచ్చినప్పుడు అప్పులు చేసి వాటికి వడ్డీ కట్టలేక చితికిపోతుంటారు. ఇలాంటి వారు తక్కువ పెట్టుబడితో కొన్ని బిజినెస్‌లు ప్రారంభించి ఉద్యోగం చేసేదాని కంటే ఎక్కువ సంపాదించవచ్చు. జీవితంలో వేగంగా ఎదగవచ్చు. అలాంటి కొన్ని బిజినెస్‌ ఐడియాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

మ్యారేజ్ బ్యూరో

ఈ రోజుల్లో మ్యారేజ్‌ బ్యూరో బిజినెస్‌ బాగా నడుస్తోంది. పెళ్లి సంబంధాలు కుదర్చడం వల్ల బాగా సంపాదించవచ్చు. కరోనా సమయంలో కూడా వివాహాలు చేసుకోవడం ఆగలేదంటే ఈ బిజినెస్‌లో సంపాదన ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఏంటంటే సరైన పెళ్లి సంబంధాన్నివెతకడం. మంచి సర్కిల్‌ ఉంటే ఈ బిజినెస్‌ బాగా సెట్‌ అవుతుంది. మంచి సంపాదన కూడా ఉంటుంది.

ఫోటోగ్రఫీ

నేటి కాలంలో ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ నుంచి పుట్టినరోజు పార్టీ వరకు ఫోటోగ్రాఫర్‌లకు బాగా డిమాండ్ ఉంటుంది. ఈ రంగంలోకి అడుగు పెట్టడం వల్ల మంచి డబ్బు సంపాదించవచ్చు.

రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం వల్ల బాగా డబ్బు సంపాదించవచ్చు. ప్రజల అవసరాలు పెరగడంతో భూములు, ఇళ్ల కొనుగోలు, అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. చాలామందికి వీటి కొనుగోలు విషయంలో అవగాహన ఉండదు. ఈ పరిస్థితిలో కచ్చితంగా బ్రోకర్ల సాయం తీసుకుంటారు.

ఇన్సూరెన్స్ ఏజెంట్‌

నేటి ప్రజల అతిపెద్ద అవసరాలలో బీమా ఒకటి. కోట్లాది మంది బీమా ఏజెంట్లుగా మంచి డబ్బు సంపాదిస్తున్నారు. ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసీతో దాదాపు 14 లక్షల మంది ఏజెంట్లు అనుబంధం కలిగి ఉన్నారు. మీరు కూడా ఏజెంట్‌గా చేరి బాగా సంపాదించవచ్చు.

పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ

కేవలం రూ.10,000 ఖర్చు చేసి పోస్టాఫీసు ఫ్రాంచైజీని తీసుకొని ఇంటి నుంచే సంపాదించవచ్చు. తక్కువ పెట్టుబడితో అధిక డబ్బు సంపాదించవచ్చు. వికలాంగులకి, గృహిణులకి ఈ బిజినెస్‌ బాగా సెట్‌ అవుతుంది.

Tags:    

Similar News