Sovereign Gold Bond Scheme: కొనుగోలుదారులకు పెద్ద షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. ఇక చౌక బంగారం కలే

Sovereign Gold Bond Scheme: సామాన్యులకు బంగారం కొనడం ఇప్పుడు కష్టంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

Update: 2025-02-04 11:19 GMT

 Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ..తాజా ధరలు ఇవే

Sovereign Gold Bond Scheme: సామాన్యులకు బంగారం కొనడం ఇప్పుడు కష్టంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇంతలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది. దీని వల్ల సామాన్యులు ప్రత్యక్షంగా ప్రభావితమవుతారు. సావనీర్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఎస్ జీ బీ గురించి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వివరించారు. ఈ పథకాన్ని క్లోజ్ చేసే మార్గంలో ఉందని ఆర్థిక మంత్రి బదులిచ్చారు. ఈ పథకం ఏమిటో, దీని మూసివేత వల్ల సామాన్యులకు చౌకగా బంగారం దొరకడం ఎలా ఆగిపోతుందో తెలుసుకుందాం.

ఇది ఏ పథకం?

సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువ ధరలకు సామాన్యులకు బంగారాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనితో పాటు ఈ పథకం కింద ప్రభుత్వం భౌతిక బంగారం కొనుగోలును తగ్గించడం, డిజిటల్ బంగారంలో పెట్టుబడిని ప్రోత్సహించడంపై కూడా దృష్టి పెడుతోంది. ఈ పథకం కింద తీసుకునే రుణాలపై ప్రభుత్వం అధిక వడ్డీని చెల్లించాల్సి వస్తుందని, దీనివల్ల ఆర్థిక భారం పెరుగుతోందని అన్నారు. ఈ కారణంగానే ప్రభుత్వం ఈ పథకాన్ని మూసివేసే దశలో ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఈ పథకం కింద ప్రభుత్వ రుణ వ్యయం పెరుగుతోంది. ఈ పథకంతో ప్రభుత్వానికి రాను రాను భారంగా మారింది. కానీ, సాధారణ పెట్టుబడిదారులు ఈ పథకం నుండి అధిక రాబడిని పొందుతున్నారు. గత కొన్ని సంవత్సరాలలోనే SGB పథకం పెట్టుబడిదారులకు 160 శాతం వరకు రాబడిని ఇచ్చింది. అయితే, ఆర్థిక కారణాల కారణంగా ప్రభుత్వానికి దీనిని కొనసాగించడం ఇప్పుడు కష్టంగా మారింది.

పెట్టుబడిదారులకు కొత్త పథకాలు

ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్‌ను నిలిపివేయనున్నప్పటికీ గోల్డ్ ఇటిఎఫ్‌లు (ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్‌లు),ఇతర ఆర్థిక ఉత్పత్తులు వంటి ఇతర కొత్త పథకాలను పరిశీలిస్తోంది. ఈ పథకాలు పెట్టుబడిదారులకు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన, సులభమైన మార్గాన్ని అందిస్తాయి. దీనితో పాటు బంగారం దిగుమతులను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. తద్వారా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉంటాయి.

Tags:    

Similar News