IT Returns: సీనియర్ సిటిజన్స్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనవసరం లేదు.. ఎందుకో తెలుసా?

IT Returns: 75 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు మినహాయింపుని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది.

Update: 2021-09-06 08:18 GMT

సీనియర్ సిటిజన్స్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనవసరం లేదు (ఫైల్ ఇమేజ్)

IT Returns: 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం నుండి 75 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు మినహాయింపుని ప్రకటించినట్లు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. సీనియర్ సిటిజన్లు ఒక ఫారమ్‌ను బ్యాంకులకు సమర్పిస్తే సరిపోతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో, అదే బ్యాంకులో పెన్షన్ ఆదాయం, టర్మ్ డిపాజిట్‌ల (ఎఫ్‌డి) పై వడ్డీని పొందే పన్ను రిటర్నులను దాఖలు చేయడం నుండి 75 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు మినహాయింపుని అందించడం జరిగింది. ఈ సీనియర్ సిటిజన్లు ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవలసిన అవసరం లేదు.

ఫారాలను బ్యాంకుకు సమర్పించాలి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) అటువంటి సీనియర్ సిటిజన్‌లకు నియమాలు మరియు డిక్లరేషన్ ఫారాలను నోటిఫై చేసింది. సీనియర్ సిటిజన్లు ఈ ఫారమ్‌ను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇది పెన్షన్, వడ్డీ ఆదాయంపై పన్ను తీసివేసి ప్రభుత్వానికి జమ చేస్తుంది. పెన్షన్ డిపాజిట్ చేయబడిన అదే బ్యాంక్ నుండి వడ్డీ ఆదాయం పొందిన సందర్భంలో ఆదాయపు పన్ను మినహాయింపు అందుబాటులో ఉంటుంది.

రిటర్న్స్ దాఖలు చేయకపోవడం వల్ల కలిగే నష్టాలు

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, పేర్కొన్న పరిమితి కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులందరూ రిటర్న్ దాఖలు చేయాలి. ఈ పరిమితి సీనియర్ సిటిజన్లకు (60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ) మరియు అత్యంత సీనియర్ సిటిజన్లకు (80 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ) కొంచెం ఎక్కువగా ఉంటుంది. పన్ను రిటర్న్ దాఖలు చేయడంలో పెనాల్టీ ఉంటుంది. సంబంధిత వ్యక్తి అదనపు పన్ను మినహాయింపు (TDS) చెల్లించాల్సి ఉంటుంది.

బడ్జెట్‌లో ఉపశమనం

సమ్మతి భారాన్ని తగ్గించడానికి బడ్జెట్ 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు కొంత ఉపశమనాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 2021-22 బడ్జెట్ ప్రసంగంలో స్వాతంత్ర్య 75 వ వార్షికోత్సవం సందర్భంగా, 75 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులపై సమ్మతి భారాన్ని తగ్గిస్తుందని చెప్పారు. 

Tags:    

Similar News