SBI: ఎస్బీఐ ఖాతాదారులకు గమనిక.. మార్చి 31లోపు ఈ పనిచేయకపోతే..?

SBI: మీకు ఎస్బీఐలో ఖాతా ఉంటే ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోండి. మార్చి 31లోపు కేవైసీ చేయకపోతే అకౌంట్ క్లోజ్ అవుతుంది.

Update: 2022-01-27 10:30 GMT

SBI: ఎస్బీఐ ఖాతాదారులకు గమనిక.. మార్చి 31లోపు ఈ పనిచేయకపోతే..?

SBI: మీకు ఎస్బీఐలో ఖాతా ఉంటే ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోండి. మార్చి 31లోపు కేవైసీ చేయకపోతే అకౌంట్ క్లోజ్ అవుతుంది. దీనిని నివారించాలంటే గడువులోపు కేవైసీ చేయించుకోండి. ఇప్పటికే మీరు KYC అప్డేట్ సందేశాన్ని పొందుతున్నట్లయితే తేలికగా తీసుకోకండి వెంటనే ఈ పనిని పూర్తి చేయండి. KYC అప్డేట్తో ఆధార్ కార్డ్, పాన్ను లింక్ చేయాలని స్టేట్ బ్యాంక్ తెలిపింది. మీరు ఈ రెండు డాక్యుమెంట్లను లింక్ చేయకుంటే ఒకే మెసేజ్ ద్వారా ఇంట్లో కూర్చొని ఆధార్, పాన్లను లింక్ చేయవచ్చు. SBI ఇప్పటికే హెచ్చరించిన వేల ఖాతాలను మూసి వేసే అవకాశం ఉంది.

ఇప్పటికే ఎస్బీఐ అనేక మాధ్యమాల ద్వారా KYC నవీకరన గురించి సమాచారాన్ని అందించింది. తన అధికారిక ఖాతా నుంచి ట్వీట్లు కూడా చేసింది. SBI ప్రకారం KYCని అప్డేట్ చేయాల్సిన ఖాతాలు వేలాదిగా ఉన్నాయి. చివరి తేదీ మార్చి 31గా నిర్ణయించారు. ఈ గడువులోగా ఖాతా KYCని తప్పనిసరిగా అప్డేట్ చేయాలి లేదంటే తర్వాత ఖాతా నుంచి ఎలాంటి లావాదేవీ ఉండదు. ATM లేదా డెబిట్ కార్డ్ కూడా పని చేయదు. ఏప్రిల్ 1 నుంచి బ్యాంక్ సర్వీస్ ప్రయోజనం కూడా ఆగిపోతుంది. ఖాతాకి సంబంధించిన అన్ని సేవలు నిలిచిపోతాయి. బ్యాంక్ ప్రకారం కస్టమర్ పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే అప్పుడు పాన్ నిరుపయోగంగా మారుతుంది బ్యాంకు ఏ సేవను పొందలేరు.

పాన్ను ఆధార్తో ఇలా లింక్ చేయండి..

1. ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ను తెరవండి https://incometaxindiaefiling.gov.in/

2. యూజర్ ఐడి, పాస్వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వండి.

3. మీ పాన్ను ఆధార్తో లింక్ చేయమని అడుగుతున్న పాప్ అప్ విండో కనిపిస్తుంది. కాకపోతే మెనూ బార్లోని 'ప్రొఫైల్ సెట్టింగ్లు'కి వెళ్లి, 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి.

4. పాన్ వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు ముందుగానే పేర్కొవాలి.

5. స్క్రీన్పై మీ ఆధార్, పాన్ వివరాలను ధృవీకరించండి. సరిపోలని పక్షంలో మీరు దానిని ఏదైనా పత్రంలో సరిదిద్దవలసి ఉంటుందని గమనించండి.

6. వివరాలు సరిపోలితే మీ ఆధార్ నంబర్ను నమోదు చేసి "లింక్ నౌ" బటన్పై క్లిక్ చేయండి.

7. మీ ఆధార్ మీ పాన్తో విజయవంతంగా లింక్ చేయబడిందని పాప్-అప్ సందేశం మీకు వస్తుంది.

Tags:    

Similar News