SBI: ఎస్బీఐ ఖాతాదారులు రూ.342 చెల్లిస్తే చాలు.. రూ.4 లక్షల ప్రయోజనం..!

SBI: ఎస్బీఐ ఖాతాదారులు రూ.342 చెల్లిస్తే చాలు.. రూ.4 లక్షల ప్రయోజనం..!

Update: 2022-03-18 12:00 GMT

SBI: ఎస్బీఐ ఖాతాదారులు రూ.342 చెల్లిస్తే చాలు.. రూ.4 లక్షల ప్రయోజనం..!

SBI: కొవిడ్‌ తర్వాత బీమాపై ప్రజలకు అవగాహన పెరిగింది. సమాజంలోని ప్రతి వర్గానికి బీమాను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ అతి తక్కువ డబ్బుతో బీమా సౌకర్యాన్ని అందిస్తోంది. ప్రభుత్వ పథకాలు, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకాలు రూ.4 లక్షల వరకు ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా దీని కోసం మీరు కేవలం రూ.342 చెల్లించాల్సి ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేయడం ద్వారా ఈ రెండు పథకాల గురించి సమాచారాన్ని అందించింది. SBI ఈ ట్వీట్‌లో 'మీ అవసరానికి అనుగుణంగా బీమా చేసుకోండి, ఆందోళన లేని జీవితాన్ని గడపండి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఖాతాదారుల నుంచి ఆటో డెబిట్ సౌకర్యం ద్వారా ప్రీమియం తీసివేయబడుతుంది. ఒక వ్యక్తి ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే పథకంలో చేరడానికి అర్హులు' అని తెలిపింది.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాదంలో బీమా పొందిన వ్యక్తి మరణించినా లేదా పూర్తిగా వికలాంగుడైనా, రూ. 2 లక్షల పరిహారం లభిస్తుంది. ఈ పథకం కింద బీమా చేయబడిన వ్యక్తి పాక్షికంగా లేదా శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే అతనికి రూ. 1 లక్ష కవర్ లభిస్తుంది. ఇందులో 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా రక్షణ పొందవచ్చు. ఈ ప్లాన్ వార్షిక ప్రీమియం కూడా రూ.12 మాత్రమే.

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేసిన వ్యక్తి మరణిస్తే నామినీకి రూ. 2 లక్షలు అందజేయడం గమనించదగ్గ విషయం. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకం కోసం మీరు కేవలం రూ. 330 వార్షిక ప్రీమియం మాత్రమే చెల్లించాలి. ఈ రెండూ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలే అని గుర్తుంచుకోండి. ఈ బీమా ఏడాది పాటు మాత్రమే ఉంటుంది.

ఈ బీమా క‌వ‌ర్ జూన్ 1 నుంచి మే 31 వ‌ర‌కు ఉంటుంద‌ని మీరు తెలుసుకోవాలి. దీని కోసం మీకు బ్యాంకు ఖాతా ఉండాలి. బ్యాంక్ ఖాతా మూసివేసినా లేదా ప్రీమియం తగ్గింపు సమయంలో ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకున్నా బీమా రద్దు అవుతుంది. అందువల్ల బీమా తీసుకునే ముందు మొత్తం సమాచారాన్ని తెలుసుకోవడం మంచిది.

Tags:    

Similar News