SBI vs BoB: ఎస్బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. మిగతా వాటితో పోలిస్తే వడ్డీ ఎక్కువ..!

SBI vs BoB:డబ్బులు ఎక్కువగా ఉంటే బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడం ఉత్తమ ఎంపిక. దీనివల్ల మీ డబ్బుకు భద్రతతో పాటు వడ్డీ కూడా లభిస్తుంది.

Update: 2024-03-17 14:30 GMT

SBI vs BoB: ఎస్బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. మిగతా వాటితో పోలిస్తే వడ్డీ ఎక్కువ..!

SBI vs BoB: డబ్బులు ఎక్కువగా ఉంటే బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడం ఉత్తమ ఎంపిక. దీనివల్ల మీ డబ్బుకు భద్రతతో పాటు వడ్డీ కూడా లభిస్తుంది. అంతేకాకుండా రూ.5 లక్షలలోపు డిపాజిట్లకు ఇన్సూరెన్స్‌ కూడా ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్‌ బ్యాంకులలో కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయవచ్చు. అయితే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఇందులో వడ్డీ ఎక్కువగా లభిస్తుంది. ఈ రెండు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఎస్బీఐ గ్రీన్ టర్మ్ డిపాజిట్ పథకం

సీనియర్ సిటిజన్లు గ్రీన్ డిపాజిట్ స్కీమ్ కింద అధిక వడ్డీ ప్రయోజనం పొందుతున్నారు. సీనియర్ సిటిజన్లు 1111 రోజులు, 1777 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీని పొందుతున్నారు. 2222 రోజుల కాలవ్యవధితో డిపాజిట్లపై 7.40 శాతం వడ్డీ లభిస్తుంది. సాధారణ పౌరులు 1111 రోజులు, 1777 రోజుల FDలపై 6.65 శాతం వడ్డీ ప్రయోజనాన్ని పొందుతున్నారు. 2222 రోజుల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే రిటైల్ డిపాజిట్లపై 6.40 శాతం వడ్డీ లభిస్తుంది.

ఈ స్కీం ప్రయోజనాన్ని ఎవరు పొందవచ్చు?

ఈ స్కీం ప్రయోజనాన్ని ఎన్‌ఆర్‌ఐ కస్టమర్లతో సహా అందరూ పొందవచ్చు. మీరు బ్రాంచ్ నెట్‌వర్క్ ద్వారా ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. త్వరలో ఈ పథకం ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఎర్త్ గ్రీన్ టర్మ్ డిపాజిట్

ఇది కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు ఎర్త్ గ్రీన్ టర్మ్ డిపాజిట్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ పథకం లక్ష్యం అర్హత కలిగిన పర్యావరణ కార్యక్రమాలకు నిధుల కోసం డిపాజిట్లను సమీకరించడం. రూ. 5000 నుంచి రూ. 2 కోట్ల లోపు మొత్తాలకు బ్యాంకు ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. బ్యాంకు ఖాతాదారులకు ఒక సంవత్సర కాలానికి 6.75%, 18 నెలలకు 6.75%, 777 రోజులకు 7.17%, 1111 రోజులకు 6.4%, 1717 రోజులకు 6.4%, 2201 రోజులకు 6.4% వడ్డీ అందిస్తుంది.

Tags:    

Similar News