Sachin Tendulkar: టెక్నో పెయింట్స్ ప్రచారకర్తగా సచిన్ నియామకం

Sachin Tendulkar: హైదరాబాద్‌లో టెక్నో పెయింట్స్ బ్రాండ్ ప్రచారకర్తగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను నియమించారు.

Update: 2026-01-10 11:16 GMT

Sachin Tendulkar: హైదరాబాద్‌లో టెక్నో పెయింట్స్ బ్రాండ్ ప్రచారకర్తగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను నియమించారు. ఆయన మూడేళ్ల పాటు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగనున్నారు.

దేశీయ పెయింట్స్ రంగంలో టెక్నో పెయింట్స్ గత 25 ఏళ్లుగా స్థిరమైన గుర్తింపు సంపాదించుకుందని కంపెనీ చైర్మన్ ఆకూరి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఏడు రాష్ట్రాల్లో విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది మరో ఐదు రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు చెప్పారు.


సెప్టెంబర్ నాటికి ఐపీఓ పూర్తి చేసి, దాని ద్వారా రూ.500 కోట్లను సమీకరించనున్నట్లు వెల్లడించారు. సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా చేరడంతో కంపెనీ దేశవ్యాప్తంగా మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు.


2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.210 కోట్ల ఆదాయం సాధించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.450 కోట్ల ఆదాయం ఆశిస్తున్నట్లు ఆకూరి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News