బలపడుతోన్న రూపాయి .. కారణాలు ఏంటో తెలుసా.?

రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో 77 పైసలు మెరుగై 83.77 వద్దకు చేరింది.

Update: 2025-05-02 11:50 GMT

బలపడుతోన్న రూపాయి .. కారణాలు ఏంటో తెలుసా.?

రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో 77 పైసలు మెరుగై 83.77 వద్దకు చేరింది. ఇంత‌కీ రూపాయి బ‌ల‌ప‌డ‌డానికి కార‌ణం ఏంటి.? భ‌విష్య‌త్తులో రూపాయి ఎలా ఉండ‌నుంది.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రూపాయి విలువ బ‌లోపేతం కావ‌డానికి ముఖ్యంగా మూడు కార‌ణాలు ఉన్నాయి. విదేశీ పెట్టుబడుల ప్రవాహం, దేశీయ మార్కెట్లలో సానుకూల ట్రెండ్, అలాగే దేశీయ ఆర్థిక గణాంకాలు బలంగా ఉండ‌డం ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్పొచ్చు.

రూపాయి మెరుగుదలకు ప్రధాన కారణాలు: ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 2.37 లక్షల కోట్లకు చేరి చరిత్రలోనే అత్యధికంగా నమోదయ్యాయి. ఇది దేశీయ డిమాండ్ బలంగా ఉన్నట్టు సూచిస్తుంది. స్టాక్ మార్కెట్లు కూడా బలంగా సాగుతున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులు పెట్టారు. బుధవారం రూపాయి 42 పైసలు బలపడి 84.54 వద్ద ముగిసింది.

అయితే రూపాయి విలువ మ‌రింత బ‌ల‌ప‌డ‌నుందా.? అంటే క‌చ్చితంగా అవున‌నే స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. భార‌త్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే, గతంలోలా రూపాయి తిరిగి బలహీనపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా డాలర్ సూచిక (Dollar Index) ప్రస్తుతం 99.97 వద్ద ఉంది. ఇది 102 దాకా తిరిగి పెరిగే అవకాశం ఉందని అంచనా. అలా అయితే రూపాయి పై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది.

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.55% పెరిగి బ్యారెల్‌కు $62.45కి చేరింది. స్టాక్ మార్కెట్లు వృద్ధిలో క‌నిపిస్తున్నాయి. సెన్సెక్స్ 722 పాయింట్లు పెరిగి 80,965 వద్దకు చేరింది. నిఫ్టీ 203 పాయింట్లు పెరిగి 24,537 వద్ద ముగిసింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) బుధవారం రోజున రూ. 50.57 కోట్లు విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

మొత్తంగా చూస్తే.. దేశీయ ఆర్థిక పరిస్థితి బలంగా ఉండటంతో రూపాయి బలపడుతోంది. అయితే జియోపాలిటికల్ (రాజకీయ) ఉద్రిక్తతలు, అంతర్జాతీయ డాలర్ ట్రెండ్‌లు రూపాయిపై ప్ర‌భావం చూపే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News