లోన్‌ తీసుకునేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి.. లేదంటే అదనంగా చెల్లించాల్సిందే..!

*లోన్‌ తీసుకునేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి.. లేదంటే అదనంగా చెల్లించాల్సిందే..!

Update: 2022-08-24 08:45 GMT

లోన్‌ తీసుకునేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి.. లేదంటే అదనంగా చెల్లించాల్సిందే..!

Personal Loan: పర్సనల్ లోన్ లక్షణం ఏంటంటే మీరు రుణం తీసుకోవడానికి ఎలాంటి వస్తువును తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఏ రకమైన అవసరం వచ్చినా ఈ లోన్ పొందవచ్చు. వివాహం, వైద్య, ప్రయాణం, అత్యవసర ఖర్చులు ఇలా వేటికైనా పర్సనల్ లోన్‌ పొందవచ్చు. ఖాతాదారుడి ఆదాయాన్ని బట్టి బ్యాంకు రుణాన్ని మంజూరుచేస్తుంది. అయితే ఈ రుణంపై బ్యాంకులు అనేక రకాల ఛార్జీలను విధిస్తాయి. పర్సనల్ లోన్‌పై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధిస్తాయో తెలుసుకుందాం.

పర్సనల్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే హోమ్ లోన్ లేదా మరే ఇతర లోన్‌తో పోలిస్తే పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. పర్సనల్ లోన్ రేట్లు 10 నుంచి 24 శాతం వరకు ఉంటాయి. రుణంపై వడ్డీ రేటు ఎంత ఎక్కువగా ఉంటే మీకు అంత నష్టం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కువ EMI చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల వ్యక్తిగత రుణం తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇతర ఏ రుణాలు అందుబాటులో లేని సమయంలో మాత్రమే ఈ లోన్‌ తీసుకోవాలి.

మీరు పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే దానిని సకాలంలో చెల్లించాలి. ఎందుకంటే మీరు ఆలస్యంగా చెల్లింపు చేస్తే అనేక రకాల నష్టాలను చవిచూస్తారు. ఆలస్య చెల్లింపుపై బ్యాంక్ ఆలస్య చెల్లింపు రుసుమును వసూలు చేస్తుంది. అంతే కాకుండా అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. దీని కారణంగా మీరు భవిష్యత్తులో రుణం తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కోంటారు.ఈ రోజుల్లో బ్యాంకులు కాకుండా అనేక NBFCలు రుణాలు అందిస్తున్నాయి. అన్ని బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లు కలిగి ఉంటాయి. కాబట్టి రుణం తీసుకునే ముందు బ్యాంకు వడ్డీ రేట్ల గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. వడ్డీ రేటుతో పాట మీరు ప్రాసెసింగ్ ఫీజు, కన్వీనియన్స్ ఫీజు, ఇతర ఛార్జీల గురించి తెలుసుకోవాలని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News