EPFO: ప్రైవేటు ఉద్యోగులకు ఊరట.. ఒకపై సర్వీసు ఓవర్ లాప్ వల్ల ట్రాన్స్ ఫర్ రిజెక్ట్ చేయడం సమజసం కాదు: ఈపీఎఫ్ఓ వెల్లడి..!!

Update: 2025-05-28 03:30 GMT

EPFO: ప్రైవేటు ఉద్యోగులకు ఊరట.. ఒకపై సర్వీసు ఓవర్ లాప్ వల్ల ట్రాన్స్ ఫర్ రిజెక్ట్ చేయడం సమజసం కాదు: ఈపీఎఫ్ఓ వెల్లడి..!!

EPFO: ఈపీఎఫ్ఓ తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులకు ఎంతో ఊరట కల్పిస్తుంది అని చెప్పవచ్చు, ముఖ్యంగా ఈపీఎఫ్ఓ తాజాగా ఒక సర్కులర్ విడుదల చేసింది అందులో ఓవర్ లాపింగ్ వల్ల ఒక ఉద్యోగి పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ ఫర్ క్లెయింను రిజెక్ట్ చేయకూడదని పేర్కొంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేటు ఉద్యోగులకు పెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు.

ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి తొందరగా మారుతూ ఉంటారు ఇలాంటి సమయంలో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి సమస్య ఈ ఓవర్ లాఫింగ్ సమస్య. గురించి ఉదాహరణతో సహా తెలుసుకుందాం.

సురేష్ అనే ఉద్యోగి హైదరాబాదులో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు అతను మే 31వ తేదీ వరకు ఒక కంపెనీలో పనిచేసి, జూన్ ఒకటో తేదీ నుంచి మరో కంపెనీలో చేరిపోయాడు. అయితే సురేష్ చివరి పని తేదీ మే 31వ తేదీ అని నమోదయింది మరోవైపు కొత్త కంపెనీ మొదటి రోజుగా జూన్ ఒకటో తేదీని నమోదు చేసుకుంది అనుకుందాం. అయితే ఈ రెండు రోజుల మధ్యలో గ్యాప్ అనేది లేదు దీనినే ఓవర్ లాప్ అని అంటారు, అంటే ఒకరోజు కూడా తేడా లేకుండానే సురేష్ మరో కంపెనీలో చేరిపోయాడు. ఇప్పుడు తన పాత కంపెనీ పిఎఫ్ ఖాతాను మరో కంపెనీకి బదలాయించాలి.

ఇక్కడే ఒక టెక్నికల్ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. . అదే ఓవర్ లాప్ సమస్య ఈపీఎఫ్ఓ రికార్డు ప్రకారం సదరు సురేష్ రెండు కంపెనీలలో ఒకేరోజు పని చేసినట్లు చూపిస్తోంది. ట్రాన్స్ ఫర్ జరగలేదు. . దీంతో అతనికి కొత్త ఇబ్బందులు మొదలయ్యాయి. అయితే కొత్త మార్గదర్శకాల ప్రకారం ఓవర్ లాపింగ్ సమస్యను సాకుగా చూపిస్తూ ట్రాన్స్ ఫర్ క్లెయిం తిరస్కరించకూడదని ఈపీఎఫ్ఓ సర్క్యులర్ విడుదల చేసింది. అవసరం అనిపిస్తే ఎవరైతే క్లీన్ చేశారో ఆ ఉద్యోగం నుంచి వివరణ పొందవచ్చని ఈపీఎఫ్ఓ పేర్కొంది.

ఈ మార్పు వల్ల పాత పిఎఫ్ బాకీ మొత్తం కొత్త పిఎఫ్ ఖాతాలోకి చేరుతుంది. ఇక ఈపీఎఫ్ అతి త్వరలోనే పిఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునేందుకు అనేక కొత్త నియమాలను అమల్లోకి తేనుంది. అందులో ముఖ్యంగా ఏటీఎం ద్వారా పిఎఫ్ డబ్బులను బయటకు తీసే విధానం అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ విధానం కనుక అమల్లోకి వస్తే ప్రైవేటు ఉద్యోగులు కష్ట సమయాల్లో పీఎఫ్ డబ్బులు సులభంగా బయటకు తీసుకునే అవకాశం లభిస్తుంది.

Tags:    

Similar News