First Quarter Results: రికార్డు స్థాయి లాభాలు సాధించిన ప్రభుత్వ బ్యాంకులు.. టాప్ లో ఏ బ్యాంకు ఉందో తెలుసా ?

First Quarter Results: దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెల్లడయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలను నమోదు చేశాయి.

Update: 2025-08-09 08:00 GMT

First Quarter Results: రికార్డు స్థాయి లాభాలు సాధించిన ప్రభుత్వ బ్యాంకులు.. టాప్ లో ఏ బ్యాంకు ఉందో తెలుసా ?

First Quarter Results: దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెల్లడయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలను నమోదు చేశాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈసారి ఏకంగా 11 శాతం అధికంగా లాభాలు వచ్చాయి. ఈ త్రైమాసికంలో మొత్తం రూ.44,218 కోట్ల లాభం వచ్చింది. ఈ మొత్తం లాభంలో ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే 43 శాతం వాటా ఉండడం విశేషం.

మొత్తం లాభంలో సింహభాగం ఎస్బీఐ నుంచే వచ్చింది. ఈ బ్యాంకు ఒక్కటే తొలి త్రైమాసికంలో రూ.19,160 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది గతేడాదితో పోలిస్తే 12 శాతం ఎక్కువ. అయితే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రం లాభాల విషయంలో వెనకబడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం 48 శాతం తగ్గి రూ.1,675 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ బ్యాంకు రూ.3,252 కోట్ల లాభాన్ని పొందింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తప్ప మిగిలిన అన్ని ప్రభుత్వ బ్యాంకులు లాభాల బాటలో పయనించడం గమనించదగిన విషయం.

ఏ బ్యాంకు ఎంత లాభం పొందింది?

మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మినహా అన్ని బ్యాంకులు లాభాలు సాధించాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లాభాల వృద్ధిలో ముందుంది. 76 శాతం వృద్ధితో రూ.1,111 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నికర లాభం 48 శాతం పెరిగి రూ.269 కోట్లకు చేరింది.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 32.8 శాతం వృద్ధితో రూ.1,169 కోట్లుగా నమోదైంది. ఇండియన్ బ్యాంక్ నికర లాభం 23.7 శాతం పెరిగి రూ.2,973 కోట్లకు చేరింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నికర లాభం 23.2 శాతం పెరిగి రూ.1,593 కోట్లగా ఉంది. మొత్తం మీద దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు స్థిరంగా, లాభదాయకంగా పనిచేస్తున్నాయని ఈ ఆర్థిక ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఒక సానుకూల సంకేతం.

Tags:    

Similar News