Real Estate Tips: ఆస్తులు కొనేముందు ఈ 5 డాక్యుమెంట్లను చెక్ చేయండి..లేదంటే మోసంలో కూరుకుపోతారు
Real Estate Tips: మీరు ఏదైనా ఆస్తి కొనాలనుకుంటున్నారా? లేదా ఏదైనా ఇల్లును కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఐదు డాక్యుమెంట్లను కచ్చితంగా చెక్ చేయండి. ఈ ఐదులో ఒకటి సరిగా లేకపోయినా ఆ ల్యాండ్ లేదా ఆ ఇంటిని కొనకండి.
Real Estate Tips: ఆస్తులు కొనేముందు ఈ 5 డాక్యుమెంట్లను చెక్ చేయండి..లేదంటే మోసంలో కూరుకుపోతారు
Real Estate Tips: మీరు ఏదైనా ఆస్తి కొనాలనుకుంటున్నారా? లేదా ఏదైనా ఇల్లును కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఐదు డాక్యుమెంట్లను కచ్చితంగా చెక్ చేయండి. ఈ ఐదులో ఒకటి సరిగా లేకపోయినా ఆ ల్యాండ్ లేదా ఆ ఇంటిని కొనకండి. ఇంతకీ ఆ ఐదు డాక్యుమెంట్లేంటో తెలుసుకుందామా..
1 సేల్ డీడ్
ఏ ప్రాపర్టీ కొనేముందు అయినా ముందుగా చూడాల్సిన డాక్యుమెంట్.. సేల్ డీడ్. ఈ సేల్ డీడ్‌లోనే అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ ఇల్లు లేదా భూమి చట్టబద్దంగా కొనుగోలు చేశారా లేదా అన్న విషయం కూడా ఈ డాక్యుమెంట్ ద్వారానే తెలుస్తుంది. అదేవిధంగా భూమి వివరాలు, సరిహద్దులు వంటివి కూడా ఈ డాక్యుమెంట్ లోనే తెలుస్తాయి. ఈ డీడ్ ని బట్టే సేల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది.
2 ఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్
ప్రాపర్టీ లేదా ఇల్లు కొనాలనుకుంటే వాటిపైన ఏమైనా రుణాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి. ఎటువంటి రుణాలు ఉన్నా ఈ ఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్ లో తెలుస్తుంది. ఒకవేళ సేల్ డీడ్‌ని తాకట్టుపెట్టి తెచ్చిన రుణాల వివరాలు అన్నీ ఇక్కడ మనకు తెలుస్తాయి. ఆన్ లైన్ లో ఈ డాక్యుమెంట్ ను తీసుకునే అవకాశం ఉంది. లేదంటే అమ్మాలనుకుంటున్నారిని అడిగి ఈసీని తీసుకోవాలి. ఈ ప్రాపర్టీ 30 ఏళ్ల హిస్టరీ తెలుసుకునే అవకాశం ఉంటుంది.
3 లింక్ డాక్యుమెంట్స్
ఈ మధ్యకాలంలో చాలా భూములకు లింక్ డాక్యుమెంట్లు ఉండటం లేదు. అయితే ప్రతి సేల్ డీడ్ కి లింక్ డాక్యుమెంట్లు ఉండాలి. అంటే ఈ భూమి ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు కొన్నారు.. అనే వివరాలన్నీ ఈ డాక్యుమెంట్లలో మనం తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఈ భూమి నిజమైనదా లేదా ఫ్రాడా అన్నది తెలుసుకోవచ్చు.
రెరా రిజిస్ట్రేషన్
2016లో తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డవల్మెంట్ చట్టం ప్రకారం రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ చట్టాన్ని కొనుగోలుదారుడు ప్రయోజనం కోసం తీసుకొచ్చారు. ఇందులో 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ లేదా ఎనిమిది కంటే ఎక్కువ యూనిట్లు ఉన్న ప్రాజెక్టులు తప్పనిసరిగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ తర్వాత డెవలపర్లు ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు అంటే లేఅవుట్, ప్రాణాళిక, ప్రభుత్వ అనుమతులు, సమయం వంటివి ఈ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి. దీనివల్ల కొనుగోలు చేసేవారు ఈ వివరాలను తెలుసుకుని ధైర్యంగా కొనుగోలు చేయగలుగుతారు.
5 బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్
ఈ స్కీమ్ ఏంటంటే.. నిర్మాణాలలో అనుమతులు లేకుండా లేదా నిబందనలకు విరుద్దంగా చేసిన నిర్మాణాలను కంట్రోల్ చేసే పథకం. ఇందులో కొంత డబ్బును చెల్లించి తమ నిర్మాణాలను చట్టబద్దం చేసుకుంటారు. దీని ద్వారా ప్రజలు చట్టబద్దమైన నిర్మాణాలను కలిగి ఉంటారు. కాబట్టి మీరు కొనుగోలు చేసే ప్రాపర్టీ లేదా ఇల్లు ఇలా చట్టబద్దంగా ఉందో లేదో తెలుసుకోవాలంటే బిల్డింగ్ రెగ్యులేషన్ లో వివరాలను పరిశీలించాలి.