Interest Rates: ఆర్బీఐ రెపోరేటుని పెంచింది.. ఇప్పుడు బ్యాంకులు వడ్డీరేట్లలో మార్పులు చేశాయి..!

Interest Rates: కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేటుని పెంచిన సంగతి తెలిసిందే.

Update: 2022-05-08 12:00 GMT

Interest Rates: ఆర్బీఐ రెపోరేటుని పెంచింది.. ఇప్పుడు బ్యాంకులు వడ్డీరేట్లలో మార్పులు చేశాయి..!

Interest Rates: కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేటుని పెంచిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ రెపో రేటు 4.4 శాతానికి అంటే 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. సెంట్రల్ బ్యాంక్ ఇతర వివిధ బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటు ఇది. ఈ పరిస్థితిలో చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. ఎఫ్‌డిపై ఇచ్చే వడ్డీ రేటును కూడా పెంచాయి. కొత్త రేట్ల గురించి తెలుసుకుందాం.

1. బంధన్ బ్యాంక్

బంధన్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీని 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇప్పుడు బంధన్ బ్యాంక్ 2 లేదా 3 సంవత్సరాల FDపై 6.25%, 5 సంవత్సరాల FDపై 5.60% వడ్డీని చెల్లిస్తుంది.

2. ICICI బ్యాంక్

ఐసీఐసీఐ బ్యాంక్ మే 4 నుంచి రెపో ఆధారిత వడ్డీ రేటును 8.10 శాతానికి పెంచింది. ఈ పెంపు తర్వాత వ్యక్తిగత రుణాలు, కారు లేదా బైక్ రుణాలు, గృహ రుణాలు ఖరీదైనవిగా మారతాయి. దీంతో పాటు ఐసిఐసిఐ బ్యాంక్ ఎఫ్‌డిపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ మార్పు తర్వాత 2 సంవత్సరాల FDకి 4.75% వడ్డీ లభిస్తుంది. అయితే 3-5 సంవత్సరాల FDకి 4.8% వడ్డీ లభిస్తుంది.

3. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్

కోటక్ మహీంద్రా బ్యాంక్ మే 6 నుంచి తన రిటైల్ కస్టమర్లకు FDపై వడ్డీ రేట్లను 0.35% వరకు పెంచింది. అయితే ఈ పెంపు రూ.2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డీలకు మాత్రమే. 390 రోజుల కాలవ్యవధి కోసం FDలపై వడ్డీ రేటు 0.30% నుంచి 5.50% వరకు పెరిగింది.

4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ ఖాతాపై చెల్లించే వడ్డీని పెంచుతున్నట్లు ప్రకటించింది. జూన్ 1 నుంచి ఈ మార్పులు వర్తిస్తాయి. ఈ మార్పు తర్వాత వడ్డీ 2.90 శాతం ఉంటుంది.

5. DCB బ్యాంక్

DCB బ్యాంక్ MCLR, EBLR రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు మే 6 నుంచి అమల్లోకి వచ్చాయి.

6. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FDపై వడ్డీ రేట్లను పెంచింది. మార్పు తర్వాత గరిష్ట ప్రయోజనం 3-5 సంవత్సరాల FDలో అందుబాటులో ఉంటుంది. దీనిపై 7 శాతం వడ్డీ ఇస్తామని తెలిపింది.

Tags:    

Similar News