RBI వడ్డీ రేట్లు యధాతథం..

Repo Rate: కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా వెల్లడించింది.

Update: 2022-04-08 16:00 GMT

RBI వడ్డీ రేట్లు యధాతథం..

Repo Rate: కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా వెల్లడించింది. వరుసగా 11వ సారి వడ్డీరేట్లు యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 4 శాతంగా.. రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగానే ఉంటుందన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ముడిచమురు ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ పరిస్థితులున్నా.. ఈసారి కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదన్నారు.

2020 మే 22న చివరిసారిగా వడ్డీ రేట్లలో ఆర్బీఐ మార్పులు చేసింది. ఫలితంగా రెపో రేటు 4 శాతం కనిష్ఠానికి చేరింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ కొత్త సమస్య ఎదుర్కొంటుందని శక్తికాంత దాస్ తెలిపారు. వంట నూనె ధరలు కొంతకాలం అధికంగానే ఉంటాయన్నారు. విదేశీ మారక నిల్వలకు లోటు లేదన్నారు. ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ఆర్బీఐ సర్వసన్నద్ధమై ఉందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News