RBI: ఆర్బీఐ అలర్ట్‌.. క్రెడిట్‌, డెబిట్‌ చెల్లింపుల నిబంధనలలో మార్పులు..!

RBI Rules: అక్టోబర్ 1 నుంచి బ్యాంకింగ్ నిబంధనలలో పెద్ద మార్పు రానుంది.

Update: 2022-08-26 12:10 GMT

RBI: ఆర్బీఐ అలర్ట్‌.. క్రెడిట్‌, డెబిట్‌ చెల్లింపుల నిబంధనలలో మార్పులు..!

RBI Rules: అక్టోబర్ 1 నుంచి బ్యాంకింగ్ నిబంధనలలో పెద్ద మార్పు రానుంది. ఈ మేరకు ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వినియోగదారుల కోసం ఆర్బీఐ కార్డ్-ఆన్-ఫైల్ టోకనైజేషన్ (Card-on-file tokenization) నిబంధనలను తీసుకువస్తోంది. దీనివల్ల కార్డ్ హోల్డర్‌లకు మరిన్ని సౌకర్యాలు లభిస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఆర్బీఐ సమాచారం ప్రకారం.. ఈ కొత్త నిబంధనల ఉద్దేశ్యం చెల్లింపులని మునుపటి కంటే మరింత సురక్షితంగా చేయడం. వాస్తవానికి గత కొన్ని రోజులుగా క్రెడిట్-డెబిట్ కార్డ్‌లతో విపరీతమైన మోసాలు జరుగుతున్నాయి. అయితే కొత్త రూల్స్‌ అమల్లోకి వచ్చిన తర్వాత వినియోగదారులు ఆన్‌లైన్‌లో లావాదేవీలు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌తో చెల్లింపులు చేస్తే అన్ని వివరాలు ఎన్‌క్రిప్టెడ్ కోడ్‌లో సేవ్ అవుతాయి.

టోకెన్ సిస్టమ్ మొత్తం డెబిట్, క్రెడిట్ కార్డ్ డేటాను 'టోకెన్లు'గా మారుస్తుంది. దీని ద్వారా మీ కార్డ్ సమాచారం పరికరంలో సేవ్‌ అవుతుంది. టోకెన్ బ్యాంకును అభ్యర్థించడం ద్వారా ఎవరైనా కార్డును టోకెన్‌గా మార్చుకోవచ్చని ఆర్‌బిఐ తెలిపింది. కార్డును టోకనైజ్ చేయడానికి ఎటువంటి ఛార్జీ లేదు. మీరు మీ కార్డ్‌ని టోకెన్‌గా మార్చినట్లయితే మీ కార్డ్ సమాచారాన్ని ఏదైనా షాపింగ్ వెబ్‌సైట్ లేదా ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో టోకెన్‌లో సేవ్ చేయవచ్చు.

ఆర్బీఐ ఈ కొత్త నిబంధన వల్ల కస్టమర్ నుంచి అనుమతి తీసుకోకుండా అతని క్రెడిట్ పరిమితిని పెంచలేరు. ఇది మాత్రమే కాదు ఏదైనా చెల్లింపు చేయకపోతే వడ్డీని జోడించేటప్పుడు రుసుము లేదా పన్ను మొదలైనవి క్యాపిటలైజ్ చేయబడవు. ఇది కస్టమర్లకు హాని కలిగించదు. కొత్త నిబంధన అమల్లోకి రావడంతో మోసాల కేసులు తగ్గుతాయని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది.

Tags:    

Similar News