Home Loan EMI: హోమ్‌ లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్‌.. త‌గ్గ‌నున్న ఈఎంఐ

Home Loan EMI: హోమ్ లోన్ తీసుకున్న వారికి భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తూ ప్రకటన చేసింది. దీంతో వడ్డీభారం త‌గ్గ‌నుంది.

Update: 2025-06-06 13:00 GMT

Home Loan EMI: హోమ్‌ లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్‌.. త‌గ్గ‌నున్న ఈఎంఐ

Home Loan EMI: హోమ్ లోన్ తీసుకున్న వారికి భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తూ ప్రకటన చేసింది. దీంతో వడ్డీభారం త‌గ్గ‌నుంది. ఇది నెల‌వారీ ఈఎమ్ఐల ప్ర‌బావం చూపనుంది. ఆర్బీఐ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించ‌డం ఈ ఏడాదిలో ఇది మూడోసారి కావ‌డం విశేషం.

ఫ్లోటింగ్ రేటుతో ఉన్నవారికి లాభమే

2019 అక్టోబర్ 1 తర్వాత తీసుకున్న గృహ రుణాలన్నీ ఫ్లోటింగ్ రేటు ఆధారంగా ఉంటాయి. కనుక తాజా వడ్డీ రేటు తగ్గింపు ప్రభావం నేరుగా వారికి పడుతుంది. బ్యాంకులు ఈ మార్పును తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా రుణం తీసుకునేవారికి కూడా తక్కువ వడ్డీకే రుణం లభించనుంది. అంతేకాదు, ఎక్కువ మొత్తంలో రుణం పొందే అవకాశమూ ఉంటుంది.

RBI నిర్ణయంతో గృహ రుణదారుల ముందే రెండు మార్గాలు ఉన్నాయి. వీటిలో ఒక‌టి ఈఎంఐ మొత్తాన్ని త‌గ్గించుకోవ‌డం అయితే రెండో ఆప్ష‌న్ కాలవ్యవధిని కుదించుకోవ‌డం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రెండో ఎంపికపై దృష్టి పెట్టడం ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది దీర్ఘకాలంలో భారీ వడ్డీ మొత్తాన్ని ఆదా చేసే అవకాశం ఇస్తుంది.

ఈఎంఐలో తగ్గింపు ఎలా ఉంటుంది?

ఉదాహరణకు 2025 జనవరిలో రూ.50 లక్షల రుణాన్ని 20 ఏళ్ల కాలవ్యవధికి 8.50% వడ్డీ రేటుతో తీసుకున్నారని అనుకుందాం. నెలవారీ ఈఎంఐ రూ. 43,391గా ఉండేది. తాజాగా వడ్డీ రేట్లు తగ్గడంతో అదే రుణం కోసం ఇప్పుడు ఈఎంఐ రూ. 40,280కి తగ్గనుంది. అంటే నెలకు సుమారుగా రూ. 3,100 మేర ఆదా అవుతుంది. దీర్ఘకాలంలో మొత్తం వడ్డీ సుమారుగా రూ. 7.12 లక్షలు ఆదా అవుతుంది.

కాలవ్యవధి తగ్గించుకుంటే ఎంత లాభం?

ఈఎంఐ మొత్తాన్ని అలాగే ఉంచుకొని, రుణ కాలవ్యవధిని తగ్గిస్తే మెరుగైన లాభం పొందవచ్చు. ఉదాహరణకు, మొదటగా తీసుకున్న 240 నెలల రుణ గడువు కాలాన్ని ఇప్పుడు 206 నెలలకు తగ్గించుకోవచ్చు. దీని వ‌ల్ల‌ మొత్తం వడ్డీ భారం సుమారుగా రూ. 14.78 లక్షల మేర తగ్గనుంది.

బ్యాంకుల స్పందన కీలకం

ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించినప్పటికీ, దాని ప్రయోజనం వినియోగదారులకు ఎంత వేగంగా చేరుతుందన్నది బ్యాంకుల చర్యలపై ఆధారపడి ఉంటుంది. ఫ్లోటింగ్ రేటుతో గల రుణాల విషయంలో, బ్యాంకులు రెగ్యులర్‌గా (కనీసం త్రైమాసికంగా) వడ్డీ రేటును సమీక్షించి సవరించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News