Term Insurance: టర్మ్‌ ఇన్సూరెన్స్‌ వాయిదా వేస్తున్నారా.. కచ్చితంగా ఇవి తెలుసుకోవాల్సిందే..!

Term Insurance: టర్మ్‌ ఇన్సూరెన్స్‌ వాయిదా వేస్తున్నారా.. కచ్చితంగా ఇవి తెలుసుకోవాల్సిందే..!

Update: 2022-06-17 06:00 GMT

Term Insurance: టర్మ్‌ ఇన్సూరెన్స్‌ వాయిదా వేస్తున్నారా.. కచ్చితంగా ఇవి తెలుసుకోవాల్సిందే..!

Term Insurance: ఇన్సూరెన్స్‌ అనేది కచ్చితంగా ఒక కుటుంబానికి ఆర్థిక భరోసాని కల్పిస్తుంది. ముఖ్యంగా నెలవారీ ఆదాయంపై ఆధారపడే ఉద్యోగులు కానీ మరే ఇతర వ్యక్తులకు కానీ ఇన్సూరెన్స్‌ చాలా ముఖ్యం. అందులో ఇలాంటి వారు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. అప్పుడే వీరు ధైర్యంగా ఉండగలరు. ఇలాంటి వారు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అనేది వాయిదా వేయాలనుకుంటే ఒక్కసారి ఈ విషయాలు గుర్తుంచుకుంటే మంచిది.

టర్మ్ ప్లాన్ అనేది మీరు లేనప్పుడు మీ కుటుంబ ఆర్థిక అవసరాలను రక్షిస్తుంది. ఒక వ్యక్తి టర్మ్ ప్లాన్ తీసుకున్నట్లయితే దురదృష్టవశాత్తు మరణిస్తే కుటుంబానికి ఏకమొత్తం అందుతుంది. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా టర్మ్ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేయవచ్చు. అయితే ప్లానర్లు 20-25 ఏళ్ల వయస్సులో టర్మ్ పాలసీని కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తున్నారు. ఉద్యోగం ప్రారంభంలోనే టర్మ్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.

భారతదేశంలోని బీమా ప్రొవైడర్లు ఆరోగ్యవంతమైన దరఖాస్తుదారులకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను అందించాలనుకుంటున్నారు. సాధారణంగా చిన్న వయస్సులో ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారు. ఈ పరిస్థితిలో బీమా సంస్థలు వారికి తక్కువ ప్రీమియంలతో టర్మ్ ప్లాన్‌లను అందిస్తాయి. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఎటువంటి మెచ్యూరిటీ ప్రయోజనాలను కలిగి ఉండవు అని గుర్తుంచుకోండి. టర్మ్ ప్లాన్ పూర్తిగా జీవిత బీమా పథకం. దీంతో మీరు తక్కువ ప్రీమియంతో చాలా ఎక్కువ మొత్తంలో కవరేజీని పొందుతారు. ఎండోమెంట్ ప్లాన్‌లో మీరు ఎక్కువ ప్రీమియం చెల్లించాలి. కానీ టర్మ్ ప్లాన్‌తో పోలిస్తే ఎండోమెంట్ ప్లాన్ లో చాలా తక్కువ కవరేజీని పొందుతారు.

Tags:    

Similar News