Post Office Scheme: సుకన్య సమృద్ధి యోజన తర్వాత బెస్ట్‌ స్కీం ఇదే.. వడ్డీ అధికంగా చెల్లిస్తారు..!

Post Office Scheme: సామాన్య ప్రజల కోసం పోస్టాఫీసు చాలా పొదుపు స్కీంలను ప్రవేశపెట్టింది.

Update: 2024-05-10 03:30 GMT

Post Office Scheme: సుకన్య సమృద్ధి యోజన తర్వాత బెస్ట్‌ స్కీం ఇదే.. వడ్డీ అధికంగా చెల్లిస్తారు..!

Post Office Scheme: సామాన్య ప్రజల కోసం పోస్టాఫీసు చాలా పొదుపు స్కీంలను ప్రవేశపెట్టిం ది. ఇందులో నిర్ణీత కాలానికి సంబంధించిన స్కీములతో పాటు మంత్‌లీ స్కీములు కూడా ఉం టాయి. ఇందులో మహిళలు, పిల్లలు, వృద్ధులకు సంబంధించిన అన్ని రకాల స్కీములు ఉంటా యి. పోస్టాఫీసు పథకాలలో బ్యాంకులు ఇచ్చే వడ్డీకంటే ఎక్కువ చెల్లిస్తారు. ఇప్పటి వరకు పోస్టా ఫీసు స్కీంలో సుకన్య సమృద్ధి యోజనలో అధికంగా వడ్డీ చెల్లిస్తున్నారు. తర్వాత సీనియర్‌ సిటిజన్‌ స్కీంలో అధిక వడ్డీ లభిస్తుంది. ఈ రోజు ఈ స్కీంలో ఎవరు ఇన్వెస్ట్‌ చేయాలి.. ఎంత ఇన్వెస్ట్‌ చేయాలి.. వడ్డీ ఎంత.. తదితర వివరాలు తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో జనవరి 1, 2024 నుంచి ప్రతి నెలా రూ.20 వేలు పెట్టుబడి పెట్టే వారికి ఏడాదికి 8.2 శాతం వడ్డీ అందిస్తుంది. కేవలం 1000 రూపాయలతో ఇందు లో పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఇందులో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 30 లక్షల వరకు ఉం టుంది. రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థికంగా ఇబ్బందిపడకుండా ఉండేందుకు ఈ పథకం ఉపయోగప డుతుంది. ఇందులో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వ్యక్తి లేదంటే జీవిత భాగస్వా మితో ఉమ్మడి ఖాతాను ఓపెన్ చేయవచ్చు.

పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే వ్యక్తి 5 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే అంతకన్నా ముందే ఖాతా క్లోజ్‌ చేస్తే నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి SCSS ఖాతాను సులభంగా ఓపెన్ చేయవచ్చు. ఈ పథకం కింద కొన్ని సందర్భాల్లో వయో సడలింపు కూడా ఇస్తారు. మన దేశంలోని అన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్‌లకు 5 సంవత్సరాలకు FD చేయడానికి 7 నుంచి 7.75 శాతం వడ్డీని అందిస్తుంటే పోస్టాఫీస్‌ స్కీం మాత్రం 8.2 శాతం వడ్డీని అందిస్తుంది.

ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్‌లకు ఐదేళ్ల ఎఫ్‌డిపై 7.50 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 7.50 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 7.50 శాతం వడ్డీ వార్షికంగా ఇస్తోంది. ఈ పథకంలోని ఖాతాదారుడు పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా పొందవచ్చు. SCSSలో పెట్టుబడి పెట్టే వ్యక్తికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు వార్షిక పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ పథకంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు.

Tags:    

Similar News