Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకి శుభవార్త.. లావాదేవీలలో పెద్ద మార్పు..!

Post office: పోస్టాఫీసు కస్టమర్లకు ఇది శుభవార్తనే చెప్పాలి. లావాదేవీలకు సంబంధించి పలు నిబంధనలను మార్చింది.

Update: 2022-07-05 10:00 GMT

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకి శుభవార్త.. లావాదేవీలలో పెద్ద మార్పు..!

Post office: పోస్టాఫీసు కస్టమర్లకు ఇది శుభవార్తనే చెప్పాలి. లావాదేవీలకు సంబంధించి పలు నిబంధనలను మార్చింది. పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లలో డబ్బు విత్‌డ్రా చేసుకునే పరిమితిని పెంచింది. దీంతో పోస్టాఫీస్ పథకాలు మిగిలిన బ్యాంకులతో పోటీ పడగలవు. అంతేకాదు దీర్ఘకాలికంగా పోస్టాఫీసు డిపాజిట్లలో పెట్టుబడులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇప్పుడు ఖాతాదారులు గ్రామీణ డాక్ సేవా శాఖలో ఒక రోజులో రూ. 20,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఈ పరిమితి రూ. 5,000 వరకు మాత్రమే ఉండేది. ఇది కాకుండా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM) ఒక్క రోజులో రూ. 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ లావాదేవీలను అంగీకరించేవారు కాదు. కానీ ఇది ఇప్పుడు జరుగుతుంది.

కొత్త నిబంధనల ప్రకారం పొదుపు ఖాతాతో పాటు, ఇప్పుడు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నెలవారీ ఆదాయ పథకం (MIS),కిసాన్ వికాస్ పత్ర (KVP),నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో చెక్ డిపాజిట్ల ద్వారా డిపాజిట్‌, విత్ డ్రా జరుగుతాయి. అంతేకాదు పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్‌పై 4% వడ్డీ లభిస్తుంది. పోస్టాఫీసులో తెరిచిన పొదుపు ఖాతా కోసం కనీసం రూ. 500 మినిమమ్‌ బ్యాలెన్స్ ఉంచడం అవసరం. ఒకవేళ మీ ఖాతాలో రూ. 500 కంటే తక్కువ ఉంటే ఖాతా నిర్వహణ రుసుము కింద రూ. 100 కట్ చేస్తారు.

Tags:    

Similar News