Post Office: ప్రతిరోజు 50 రూపాయల పొదుపుతో 35 లక్షల బంపర్ రిటర్న్..!

Post Office: పేద, మధ్య తరగతి ప్రజలకి పోస్టాఫీసు పథకాలు ఉత్తమమైనవిగా చెప్పవచ్చు.

Update: 2022-11-11 03:02 GMT

Post Office: ప్రతిరోజు 50 రూపాయల పొదుపుతో 35 లక్షల బంపర్ రిటర్న్..!

Post Office: పేద, మధ్య తరగతి ప్రజలకి పోస్టాఫీసు పథకాలు ఉత్తమమైనవిగా చెప్పవచ్చు. ఇందులో తక్కువ మొత్తం నుంచి ఎక్కువ మొత్తం వరకు ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. నిజానికి కొన్ని పెట్టుబడులలో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో అందరు పెట్టుబడి పెట్టలేరు. కానీ పోస్టాఫీసులో జీరో రిస్క్‌తో పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాదు మంచి రాబడిని కూడా పొందుతారు. అలాంటి ఒక పోస్టాఫీసు స్కీం గురించి ఈ రోజు తెలుసుకుందాం.

35 లక్షల రిటర్న్!

పోస్టాఫీసు 'గ్రామ సురక్ష పథకం' చాలా ఉత్తమమైనదని చెప్పవచ్చు. ఇండియా పోస్ట్ అందించే ఈ ప్రొటెక్షన్ ప్లాన్‌లో తక్కువ రిస్క్‌తో మంచి రాబడిని పొందవచ్చు. ఈ పథకంలో ప్రతి నెలా 1500 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఈ మొత్తాన్ని క్రమం తప్పకుండా డిపాజిట్ చేయడం వల్ల రాబోయే కాలంలో 31 నుంచి 35 లక్షల వరకు ప్రయోజనం పొందుతారు.

పెట్టుబడి నియమాలు

19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద కనీస హామీ మొత్తం రూ.10,000 నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఈ ప్లాన్ ప్రీమియం చెల్లింపు నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షికంగా చేయవచ్చు. మీరు ఈ పథకంపై రుణం కూడా తీసుకోవచ్చు. ఈ పథకాన్ని తీసుకున్న 3 సంవత్సరాల తర్వాత సరెండర్ చేయవచ్చు. కానీ ఈ పరిస్థితిలో ఎటువంటి ప్రయోజనం పొందలేరు.

ఎంత ప్రయోజనం..?

ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో పెట్టుబడి పెట్టి రూ.10 లక్షల పాలసీని కొనుగోలు చేశాడనుకుందాం. అప్పుడు అతని నెలవారీ ప్రీమియం 55 సంవత్సరాలకు రూ.1515, 58 సంవత్సరాలకు రూ.1463, 60 సంవత్సరాలకు రూ.1411 అవుతుంది. ఈ పరిస్థితిలో పాలసీ కొనుగోలుదారు 55 సంవత్సరాలకు రూ. 31.60 లక్షలు, 58 సంవత్సరాలకు రూ.33.40 లక్షలు, 60 సంవత్సరాలకు రూ. 34.60 లక్షల మెచ్యూరిటీ ప్రయోజనం పొందుతారు.

Tags:    

Similar News