రోజుకి 6 రూపాయలు పొదుపు చేసి మీ బిడ్డని లక్షాధికారి చేయండి..!

Bal Jeevan Bima Yojana: పిల్లల చదువు నుంచి పెళ్లి వరకు లక్షల రూపాయలు ఖర్చవుతాయి.

Update: 2023-01-02 05:36 GMT

రోజుకి 6 రూపాయలు పొదుపు చేసి మీ బిడ్డని లక్షాధికారి చేయండి..!

Bal Jeevan Bima Yojana: పిల్లల చదువు నుంచి పెళ్లి వరకు లక్షల రూపాయలు ఖర్చవుతాయి. కాబట్టి పుట్టినప్పటి నుంచి పిల్లల కోసం పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. అనేక ప్రభుత్వ పథకాలు పిల్లల చదువుల నుంచి పెళ్లి వరకు ఖర్చులను భరించేలా ఉన్నాయి. మీరు పిల్లల కోసం మెరుగైన ఎంపిక కోసం చూస్తున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ( బాల్ బీమా యోజన ) లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో రోజుకు కేవలం రూ.6 పెట్టుబడి పెట్టి మీ బిడ్డను లక్షాధికారిని చేయవచ్చు. పిల్లల కోసం ప్రత్యేకంగా బాల్‌ జీవన్‌ బీమా యోజనను ప్రభుత్వం రూపొందించింది. తల్లిదండ్రులు పిల్లల పేరుతో బాల బీమా యోజనను కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం ఒక కుటుంబంలోని ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ పథకం 5 నుంచి 20 సంవత్సరాల పిల్లల కోసం ప్రవేశపెట్టారు. ఇందులో ప్రీమియం నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన జమ చేయవచ్చు. చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ప్రతి రోజు రూ.6 నుంచి రూ.18 వరకు ప్రీమియం డిపాజిట్ చేయవచ్చు. ఈ ప్లాన్‌లో మెచ్యూరిటీపై రూ. 1 లక్ష ప్రయోజనం అందిస్తారు.

చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ లక్షణాలు

ఈ పథకం కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే ప్రయోజనాలను అందిస్తుంది. పెట్టుబడి పెట్టడానికి పిల్లల వయస్సు 5 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీస హామీ మొత్తం ఒక లక్ష ఉంటుంది. పాలసీని కొనుగోలు చేసే సమయంలో పాలసీదారుడి వయస్సు 45 ఏళ్లు మించకూడదు. పాలసీ మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే తర్వాత బిడ్డ పాలసీకి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు.

పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత పిల్లలకు పూర్తి మెచ్యూరిటీ మొత్తం అందుతుంది. పాలసీ ప్రీమియం తల్లిదండ్రులు చెల్లించాలి. దీనిపై రుణ ప్రయోజనం లేదు. ఈ పథకాన్ని 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేయవచ్చు. మీకు రూ. 1000 హామీ మొత్తంపై ప్రతి సంవత్సరం రూ. 48 బోనస్ కూడా అందుతుంది.

ఇలా దరఖాస్తు చేసుకోండి

బాల్ జీవన్ బీమా యోజన కోసం దరఖాస్తు చేయడానికి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. పిల్లల గురించిన వివరాలు తెలియజేయాలి. (పేరు, వయస్సు, చిరునామా వంటివి). దీంతో పాటు పాలసీదారుడి వివరాలను కూడా అందించాలి. దరఖాస్తుదారు గుర్తింపు, చిరునామా రుజువును అందించాలి.

Tags:    

Similar News