ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్‌ బుక్‌ చేస్తున్నారా.. ఈ పనిచేయకపోతే పెద్ద నష్టమే..!

Online Ticket Booking: సామాన్యుడి నుంచి ధనవంతుల వరకు అందరు రైల్వేలో ప్రయాణిస్తారు.

Update: 2022-06-25 10:00 GMT

ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్‌ బుక్‌ చేస్తున్నారా.. ఈ పనిచేయకపోతే పెద్ద నష్టమే..!

Online Ticket Booking: సామాన్యుడి నుంచి ధనవంతుల వరకు అందరు రైల్వేలో ప్రయాణిస్తారు. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలు రైల్వేల ద్వారా అనుసంధానించి ఉన్నాయి. మరోవైపు దూర ప్రయాణాలకు రైలు రవాణా చాలా చౌకగా ఉంటుంది. ఇప్పుడు రైల్వే టిక్కెట్లు ఆన్‌లైన్‌లో సులభంగా బుక్ చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ప్రజలు ఒక్క నెలలోనే చాలా టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా సార్లు ప్రజలు ఈ విషయంలో సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకోవడం చాలా సులభం. రైల్వే టిక్కెట్లను ఐఆర్‌సీటీసీ ఖాతా ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అయితే IRCTC ఖాతా ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా చేయకపోతే మీరు అనేక సౌకర్యాలను కోల్పోతారు. దీని కారణంగా మీరు నష్టాన్ని కూడా భరించవలసి ఉంటుంది. వాస్తవానికి IRCTC ఖాతాతో ఆధార్ కార్డ్ లింక్ చేస్తే ప్రయాణీకులు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఒక నెలలో మరిన్ని టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మరోవైపు ఆధార్ కార్డు లింక్ చేయకపోతే తక్కువ టిక్కెట్లను మాత్రమే బుక్ చేసుకునే వీలుంటుంది. IRCTC ఖాతాను ఆధార్‌తో లింక్ చేస్తే ఒక నెలలో 24 టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే నెలలో 12 టిక్కెట్లను మాత్రమే బుక్ చేసుకోవచ్చు.

ఆధార్ లింక్ ఎలా చేయాలి..?

1. వినియోగదారు మై ప్రొఫైల్‌కు వెళ్లడం ద్వారా ఆధార్ KYC ధృవీకరించాలి.

2. వినియోగదారు మొబైల్ నంబర్‌కు OTP రావడం ద్వారా ఆధార్ ధృవీకరిస్తారు.

Tags:    

Similar News