PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 14వ విడత తేదీ ఫిక్స్.. ఖాతాలో డబ్బులు పడేది ఎప్పుడంటే?

PM Kisan Latest News: రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రైతులకు ఏటా రూ.6000 ఆర్థిక సహాయం అందజేస్తారు.

Update: 2023-07-18 07:41 GMT

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 14వ విడత తేదీ ఫిక్స్.. ఖాతాలో డబ్బులు పడేది ఎప్పుడంటే?

PM Kisan 14th Installment: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే, ఈ వార్త మీకోసమే. దేశంలోని కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి ఇంకా డబ్బులు రాకపోవడంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. 14వ విడత సొమ్ము ఏప్రిల్‌-జులైలోపు రైతుల ఖాతాల్లోకి రావాల్సి ఉంది. అయితే జులై నెల ముగియనుండడంతో కోట్లాది మంది రైతుల గుండె చప్పుడు పెరుగుతోంది. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈసారి జులై 28న డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు పంపనున్నారు.

9 కోట్ల మంది రైతులు లబ్ధి..

ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈసారి దేశంలోని 9 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ నిధిని 14వ విడత డీబీటీ రూపంలో అందజేయనున్నారు. జులై 28న డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు ప్రధాని మోదీ బదిలీ చేయనున్నారు. ఇంతకు ముందు ఫిబ్రవరి 27, 2023న రైతుల ఖాతాకు పీఎం కిసాన్ 13వ విడత పంపిణీ చేశారు.

రూ. 6000 వార్షిక ఆర్థిక సహాయం..

రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రైతులకు ఏటా రూ.6000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ డబ్బును అర్హులైన రైతుల ఖాతాలకు మూడు సమాన వాయిదాల్లో ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున అందిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో, మొదటి విడత ఏప్రిల్ నుంచి జులై వరకు, రెండవ విడత ఆగస్టు నుంచి నవంబర్ వరకు, మూడవ విడత డిసెంబర్ నుంచి మార్చి వరకు అందిస్తుంటారు.

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో లబ్ధిదారుని స్థితిని చూసే విధానం పూర్తిగా మారిపోయింది. పీఎం కిసాన్ మొబైల్ అప్లికేషన్‌ను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు లబ్ధిదారుల స్థితిని చూసే విధానం కూడా మారింది. మీరు లబ్ధిదారుని స్థితిని చూడాలనుకుంటే, దీని కోసం మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అవసరం.

Tags:    

Similar News