PM Kisan: అర్హులు కాకున్నా పీఎం కిసాన్‌ డబ్బులు తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

PM Kisan: మీరు పీఎం కిసాన్ లబ్దిదారు అయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి.

Update: 2022-06-01 11:30 GMT

PM Kisan: అర్హులు కాకున్నా పీఎం కిసాన్‌ డబ్బులు తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

PM Kisan: మీరు పీఎం కిసాన్ లబ్దిదారు అయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోండి. ఈ పథకాన్ని నకిలీ పద్ధతిలో సద్వినియోగం చేసుకున్న రైతుల నుంచి ప్రభుత్వం డబ్బులు రికవరీ చేస్తుంది. మీరు ఈ స్కీమ్‌ను తప్పుడు మార్గంలో సద్వినియోగం చేసుకున్నట్లయితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ పథకం కింద 54 లక్షల మందికి పైగా రైతులు మోసపూరితంగా డబ్బులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం వీరిపై ప్రత్యేక దృష్టి సారించింది. మీరు ఈ పథకానికి అర్హులు కానట్లయితే వెంటనే బ్యాంకుకు వెళ్లి లేదా వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా వచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వండి.

బ్యాంక్‌లో రివర్స్ ఎంట్రీ ద్వారా వాయిదాను తిరిగి చెల్లించవచ్చు..

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు మీ ఖాతాలో జమయినట్లయితే వాటిని బ్యాంకు ద్వారా తిరిగి పంపవచ్చు. దీని కోసం మీరు ముందుగా బ్యాంకుకు వెళ్లాలి. మీ ఖాతాలో ఉన్న డబ్బును రివర్స్ చేయమని బ్యాంక్ ఉద్యోగిని కోరవచ్చు. రివర్స్ ఎంట్రీ ద్వారా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఖాతాకు డబ్బు వెళ్లిన వెంటనే మీరు పిఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితా నుంచి ఆటోమేటిక్‌గా బయటకు వెళ్లిపోతారు. మీ రివర్స్డ్ డబ్బు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఖాతాకు చేరుతుంది. మీరు అనర్హులు అయితే ఈ విధంగా చేయవచ్చు.

వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా డబ్బును డిపాజిట్ చేయండి..

మీరు పీఎం కిసాన్ యోజన కింద అందుకున్న వాయిదాల డబ్బును కేంద్ర ప్రభుత్వానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలనుకుంటే మీరు ఈ ఎంపికను ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారునికి పోర్టల్ ద్వారా డబ్బును తిరిగి అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. వాయిదాల డబ్బును రీఫండ్ చేయడానికి లబ్ధిదారుడు NRTP పోర్టల్, Bharatkosh.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News