PM Kisan: రైతులకి అలర్ట్‌.. ఇంకా 10 రోజులే గడువు మరిచిపోకండి..!

PM Kisan: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2022-07-20 04:30 GMT

PM Kisan: రైతులకి అలర్ట్‌.. ఇంకా 10 రోజులే గడువు మరిచిపోకండి..!

PM Kisan: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ప్రధానమైనది పీఎం కిసాన్‌ యోజన. ఈ పథకం కింద రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఏటా రూ.6,000 నేరుగా రైతుల ఖాతాలలో జమచేస్తుంది. 2 వేల రూపాయల చొప్పున ప్రతి నాలుగు నెలలకు ఒక వాయిదా చెల్లిస్తోంది. అయితే ఈ ఆర్థిక సాయం కోసం దేశంలోని రైతులందరు ఒక పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే వారికి రూ.2000 అందవు. అదేంటంటే ఈ కేవైసీ చేయడం.

వాస్తవానికి పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు 31 జూలై 2022లోపు KYCని పూర్తి చేయాల్సి ఉంది. ఈ పని పూర్తి కావడానికి ఇప్పుడు 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అర్హులైన రైతులు ఈ పథకం కింద KYC పొందకపోతే పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు లభించవు. మోసాలను నిరోధించడానికి ప్రభుత్వం KYC ప్రక్రియను ప్రవేశపెట్టింది. మరోవైపు జులై 31, 2022లోపు KYC చేస్తే అర్హత కలిగిన రైతులు పీఎం కిసాన్ యోజన తదుపరి విడత కింద రూ.2000 పొందుతారు.

ఆన్‌లైన్ eKYC ఈ విధంగా చేయండి..

1.e-KYC కోసం అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ సందర్శించండి. అక్కడ e-kyc ఎంపికపై క్లిక్ చేయండి.

2. ఆధార్ నంబర్‌ని నమోదు చేయండి.

3. ఇప్పుడు మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేసి OTP అభ్యర్థించండి.

4. తర్వాత వివరాలు పూర్తిగా చెల్లుబాటు అయితే eKYC ప్రక్రియ పూర్తవుతుంది.

5. మరోవైపు ప్రక్రియ సరిగ్గా లేకుంటే కేవైసీ పూర్తికాదు. అప్పుడు మీరు ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా సరిదిద్దుకోవచ్చు.

Tags:    

Similar News