PM Kisan: పీఎం కిసాన్‌ రిజిస్ట్రేషన్‌లో మార్పులు.. వారికి 4000 రూపాయలు అందుతాయా..!

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో పెద్ద మార్పు జరిగింది. ఇప్పుడు కొత్తగా నమోదు చేసుకోవాలంటే రేషన్ కార్డు వివరాలు తప్పనిసరి చేశారు.

Update: 2022-06-27 04:30 GMT

PM Kisan: పీఎం కిసాన్‌ రిజిస్ట్రేషన్‌లో మార్పులు.. వారికి 4000 రూపాయలు అందుతాయా..!

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో పెద్ద మార్పు జరిగింది. ఇప్పుడు కొత్తగా నమోదు చేసుకోవాలంటే రేషన్ కార్డు వివరాలు తప్పనిసరి చేశారు. పీఎం కిసాన్ పోర్టల్‌లో రేషన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్‌ చేయడం తప్పనిసరి అయింది. అలాగే రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీలు (PDF) మాత్రమే తయారు చేసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా రైతులకు KYC కూడా తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

దీని కింద ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, డిక్లరేషన్ హార్డ్ కాపీలను తప్పనిసరిగా సమర్పించడం రద్దు చేశారు. ఇప్పుడు లబ్ధిదారులు ఈ పత్రాల PDF ఫైల్‌ను సృష్టించి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. దీనివల్ల రైతుల సమయం ఆదా చేయడంతోపాటు కొత్త విధానంలో పథకం మరింత పారదర్శకంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాల గురించి తెలుసుకుందాం.

1. ప్రభుత్వం DBT ద్వారా రైతులకు డబ్బును బదిలీ చేస్తుంది కాబట్టి బ్యాంకు ఖాతా నంబర్ కలిగి ఉండటం తప్పనిసరి.

2. బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడం అవసరం.

3. ఆధార్ కార్డు కలిగి ఉండటం తప్పనిసరి. ఇది లేకుండా మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు.

4.పీఎం కిసాన్ వెబ్‌సైట్ pmkisan.gov.inలో మీ పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

5. ఆధార్‌ను లింక్ చేయడానికి మీరు ఫార్మర్ కార్నర్ ఎంపికకు వెళ్లి ఆధార్ వివరాలను సవరించు ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా అప్‌డేట్ చేయవచ్చు.

రైతుల ఖాతాలో రూ.4 వేలు..?

వాస్తవానికి ఈ పథకం కింద పీఎం కిసాన్ 11వ విడత ఖాతా పొందని రైతులు ఇప్పుడు తదుపరి విడతతో పాటు మునుపటి మొత్తాన్ని పొందుతారు. అంటే రైతులకు ఇప్పుడు రూ.4000 అందుతాయి. అయితే 11 విడతకి అప్లై చేసుకొని ఏదైనా కారణాల వల్ల మీ ఇన్‌స్టాల్‌మెంట్ నిలిచిపోతే మీకు రూ.4000 వస్తాయి.

Tags:    

Similar News