PM Kisan: ఓట్లకు ముందు రైతులకు శుభవార్త.. ఖాతాలో డబ్బులు జమయ్యే అవకాశం..!

PM Kisan: పీఎం కిసాన్ యోజన వల్ల దేశంలో చాలామంది రైతులు లబ్ధిపొందుతున్నారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ. 2000 చొప్పున 3 విడతల్లో రూ.6000 అందిస్తారు.

Update: 2023-10-20 10:07 GMT

PM Kisan: ఓట్లకు ముందు రైతులకు శుభవార్త.. ఖాతాలో డబ్బులు జమయ్యే అవకాశం..!

PM Kisan: పీఎం కిసాన్ యోజన వల్ల దేశంలో చాలామంది రైతులు లబ్ధిపొందుతున్నారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ. 2000 చొప్పున 3 విడతల్లో రూ.6000 అందిస్తారు. ఇప్పటి వరకు 14 ఇన్‌స్టాల్‌మెంట్లు అందించారు. ఇప్పుడు 15 వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. నవంబర్ నెలలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 15 విడత ఓట్లకు ముందుగానే రిలీజ్‌ అవుతాయని అధికారులు చెబుతున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

PM-కిసాన్ యోజన అర్హతలు

భర్త, భార్య, మైనర్ పిల్లలతో కూడిన చిన్న,సన్నకారు రైతు కుటుంబాలు వారి పేర్లపై సాగు భూమిని కలిగి ఉంటే PM-KISAN పథకానికి అర్హులు అవుతారు. భూస్వాములు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, రాజ్యాంగబద్ధమైన పదవిని కలిగి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదు. మునిసిపల్ కార్పొరేషన్‌ల మాజీ, ప్రస్తుత మేయర్‌లు, జిల్లా పంచాయతీల చైర్మన్‌లు, అలాగే రాష్ట్ర అసెంబ్లీలు, రాష్ట్ర శాసన మండలి, లోక్‌సభ లేదా రాజ్యసభ మాజీ లేదా ప్రస్తుత సభ్యులు ఈ పథకానికి అర్హులు కాదు.

PM-కిసాన్ ప్రయోజనాలు

చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం లక్ష్యం. దీని కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతు ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో రూ. 2,000 చొప్పున మూడు వాయిదాలలో రూ.6,000 జమ అవుతాయి. రాష్ట్రాలు/యుటిలు అర్హులైన భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాల డేటాబేస్‌ను సిద్ధం చేస్తాయి. పారదర్శకత కోసం పంచాయతీల్లో జాబితాలను ప్రదర్శిస్తారు. సిస్టమ్ రూపొందించిన SMS ద్వారా లబ్ధిదారులకు సమాచారం అందుతుంది.

Tags:    

Similar News