PM-JANMAN: పీఎం జన్‌మన్‌ యోజన కింద ఈ ప్రయోజనాలు.. మొదటి లిస్టులో మీ పేరు ఉందా..!

PM-JANMAN: పేద వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తుంది. ఇందులో భాగంగా పీఎం గిరిజన న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్మాన్) కింద

Update: 2024-01-17 14:30 GMT

PM-JANMAN: పీఎం జన్‌మన్‌ యోజన కింద ఈ ప్రయోజనాలు.. మొదటి లిస్టులో మీ పేరు ఉందా..!

PM-JANMAN: పేద వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తుంది. ఇందులో భాగంగా పీఎం గిరిజన న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్మాన్) కింద లక్ష మంది లబ్ధిదారుల మొదటి లిస్టును ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. పీఎం జన్మన్ యోజన బడ్జెట్ రూ.24,000 కోట్లు. ఇందులో 9 మంత్రిత్వ శాఖలు పాల్గొంటాయి. దీనికింద పేదలు, వెనుకబడిన వర్గాలకు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తారు.

ప్లాన్ ఎవరి కోసం

వాస్తవానికి ఈ పథకం బలహీన గిరిజన సమూహాల కోసం ప్రవేశపెట్టారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 75 సంఘాలను గుర్తించారు. PVTGల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ వర్గాలకు సురక్షితమైన గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణ, విద్యుత్, రహదారి, టెలికాం కనెక్టివిటీ, జీవనొపాధి కల్పిస్తారు.

2023-24 సంవత్సరానికి విడుదల చేసిన బడ్జెట్ లో బలహీన గిరిజన సమూహాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి వారి అభివృద్ధికి ప్రధాన మంత్రి పివిజిటి మిషన్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పుడు మొదటి విడతగా లక్ష మంది లబ్ధిదారుల లిస్టును విడుదల చేశారు. దశల వారీగా వీరి సమూహాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తారు. జనజీవన స్రవంతిలో బతకడానికి అన్ని అవకాశాలను కల్పిస్తారు.

Tags:    

Similar News