PhonePe: ఫోన్‌పే ఇకపై లిమిటెడ్.. ఐపీఓకు రంగం సిద్ధం!
PhonePe: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తన ఐపీఓ (Initial Public Offering)కు రాకముందే ఒక కీలక ప్రకటన చేసింది. కంపెనీ ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది.
PhonePe: ఫోన్‌పే ఇకపై లిమిటెడ్.. ఐపీఓకు రంగం సిద్ధం!
PhonePe: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తన ఐపీఓ (Initial Public Offering)కు రాకముందే ఒక కీలక ప్రకటన చేసింది. కంపెనీ ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఈ మేరకు కంపెనీ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ)కు దాఖలు చేసిన కంట్రోలింగ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఐపీఓ ప్రక్రియకు అవసరమైన ముఖ్యమైన షరతులలో ఇది ఒకటని, కంపెనీ చట్టం, 2013 ప్రకారం కంపెనీని పబ్లిక్ లిమిటెడ్‌గా మార్చడం తప్పనిసరి అని పేర్కొంది. దీంతో కంపెనీ పేరు ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఫోన్‌పే లిమిటెడ్‌గా మారుతుంది.
ఐపీఓ ద్వారా కంపెనీ మొదటిసారిగా ప్రజల కోసం ప్రైమరీ మార్కెట్‌లో షేర్లను విక్రయిస్తుంది. ప్రైవేట్ కంపెనీకి ప్రజలకు షేర్లను జారీ చేసే పర్మీషన్ ఉండదు. అయితే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారడం వల్ల కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ పొందడానికి అర్హత సాధిస్తుంది. లిస్టింగ్ అంటే కంపెనీ షేర్లు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.వాటిని స్టాక్ మార్కెట్‌లో కొనుగోలు లేదా అమ్మవచ్చు. ఐపీఓ ద్వారా కంపెనీ ప్రజలకు షేర్లను విక్రయించడం ద్వారా పెద్ద మొత్తంలో మూలధనాన్ని సేకరిస్తుంది.
వాల్‌మార్ట్ మద్దతు ఉన్న డిజిటల్ పేమెంట్ కంపెనీ ఫోన్‌పే ఫిబ్రవరి 20న ఐపీఓకు రానున్నట్లు ప్రకటించింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 25న కంపెనీ ఐపీఓ కోసం సలహాదారులుగా కోటక్ మహింద్రా క్యాపిటల్, జేపీ మోర్గాన్, సిటీ, మోర్గాన్ స్టాన్లీలను ఎంచుకుంది.
సింగపూర్ నుండి తన కార్యకలాపాలను భారతదేశానికి మార్చిన మొదటి భారతీయ కంపెనీ ఫోన్‌పే.. కంపెనీ యాజమాన్యం వాల్‌మార్ట్ వద్ద ఉంది. 2022లో సింగపూర్ నుండి భారతదేశానికి మారే సమయంలో కంపెనీ ప్రభుత్వానికి దాదాపు 8,000 కోట్ల రూపాయల పన్ను కూడా చెల్లించవలసి వచ్చింది. ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్ నిగమ్ నాయకత్వంలో ఫోన్‌పే 2023లో 1 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణలో 100 మిలియన్ డాలర్లను సేకరించింది. అప్పటి కంపెనీ విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉంది. వాల్‌మార్ట్ దీనిలో అత్యధిక షేర్లను కలిగి ఉండగా, ఇతర పెట్టుబడిదారులలో మైక్రోసాఫ్ట్, జనరల్ అట్లాంటిక్, టైగర్ గ్లోబల్, రిబిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్, టెన్సెంట్ మరియు ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ఉన్నారు.