PF Alert: పీఎఫ్‌ అలర్ట్‌.. మీ అజాగ్రత్తగా వల్ల ఈ సమస్యలు తెచ్చుకోకండి..!

PF Alert: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకి చెందిన అన్ని సేవలను యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ద్వారా అందిస్తుంది.

Update: 2022-10-27 10:20 GMT

PF Alert: పీఎఫ్‌ అలర్ట్‌.. మీ అజాగ్రత్తగా వల్ల ఈ సమస్యలు తెచ్చుకోకండి..!

PF Alert: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకి చెందిన అన్ని సేవలను యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ద్వారా అందిస్తుంది. సంస్థ సేవలు లేదా సౌకర్యాలను యాక్సెస్ చేయడానికి కావలసిందల్లా UAN నంబర్, పాస్‌వర్డ్. అయితే UAN పాస్‌వర్డ్‌ను మరచిపోతే చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. పీఎఫ్‌ ఖాతా కోసం UAN కచ్చితంగా అవసరమని గుర్తుంచుకోండి.

పీఎఫ్‌ ఖాతాను యాక్సెస్ చేయడానిక UAN నంబర్‌తో పాటు పాస్‌వర్డ్‌ను సెట్ చేయాలి. పాస్‌వర్డ్ గుర్తుంచుకోవడంలో సమస్య ఉంటే దాన్ని ఎక్కడైనా రాసి పెట్టుకోవాలి. అవసరమైతే సెల్‌ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. UAN నెంబర్‌ ఉపయోగించి పీఎఫ్‌ ఖాతాను తనిఖీ చేయవచ్చు. ఇది కాకుండా ఖాతాకు సంబంధించిన అనేక ఇతర పనులు చేయవచ్చు. ఈపీఎఫ్‌వో UAN ద్వారా ఉద్యోగుల ఖాతాలకు సంబంధించిన అన్ని సేవలను అందిస్తుంది. మీరు మీ అన్ని ఖాతాలను ఒకే UAN నంబర్‌తో లింక్ చేయవచ్చు. అంతేకాదు ఉద్యోగం మారినప్పుడు UAN నంబర్‌ను మార్చాల్సిన అవసరం లేదు.

మీ UAN నంబర్ తెలిసినప్పటికీ పీఎఫ్‌ ఖాతా పాస్‌వర్డ్‌ను మరచిపోయిన సందర్భాలు ఉంటాయి. అప్పుడు మీరు ఖాతాను యాక్సెస్ చేయలేరు. పాస్‌బుక్‌లోని సమాచారాన్ని తెలుసుకోలేరు. ఖాతాదారు పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే కొత్త పాస్‌వర్డ్‌ను సృష్టించడానికి ఈపీఎఫ్‌వో అనుమతి ఇస్తుంది. అప్పుడు పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయవచ్చు.

UAN పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడం ఎలా..?

1.https://unifiedportal-mem.epfindia.gov.in./memberinterface/ వద్ద EPFO పోర్టల్‌ని సందర్శించండి.

2. UAN, పాస్‌వర్డ్, క్యాప్చా బాక్స్ క్రింద ఉన్న Forgot Passwordపై క్లిక్ చేయండి.

3. కొత్త పేజీలో మీ UAN నంబర్‌ని నమోదు చేయండి.

4. దాని కింద ఇచ్చిన captcha బాక్స్‌లో captcha కోడ్‌ని నమోదు చేయండి.

5. ఇప్పుడు సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

6. ఆపై మీ UAN పాస్‌వర్డ్‌ని మళ్లీ నమోదు చేయండి.

7. OTPని స్వీకరించడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, అవునుపై క్లిక్ చేయండి.

8. OTPని నమోదు చేసి వెరిఫై ఎంపికపై క్లిక్ చేయండి.

9. ధృవీకరించబడిన తర్వాత రెండుసార్లు కొత్త పాస్‌వర్డ్‌ను నమోదు చేయమని అడుగుతుంది.

10. చివరగా సబ్‌మిట్‌పై క్లిక్ చేసి కొత్త పాస్‌వర్డ్‌తో లాగిన్ కండి.

Tags:    

Similar News