Petrol Rate: మెట్రో నగరాల్లో స్థిరంగా పెట్రో ధరలు
Petrol Rate: హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 94 రూపాయల 16 పైసలు
Representational Image
Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు వరుసగా రెండో రోజు నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 94రూపాయల16 పైసలు వద్ద, డీజిల్ ధర 88 రూపాయల 20 పైసలు వద్ద స్థిరంగా ఉన్నాయి.ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 96రూపాయల65 పైసలు వద్ద డీజిల్ ధర 90 రూపాయల 17 పైసలు వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 56 పైసలుగా వుండగా డీజిల్ ధర 80 రూపాయల 87 పైసలు వద్దకి చేరింది.
ఆర్దిక రాజధాని ముంబై లో 96 రూపాయల 98 పైసలుగా నమోదవుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.55 శాతం పెరుగుదలతో 64.37 డాలర్లకు చేరగా డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.25 శాతం పెరుగుదలతో 60.70 డాలర్లకు ఎగసింది