Petrol Rate: గత 16 రోజులుగా నిలకడగా ఇంధన ధరలు
Petrol Rate: ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 56 పైసలు * హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 94 రూపాయల 16 పైసలు
Representational Image
Petrol Rate: దేశంలో పెట్రోల్ ,డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు మెట్రో నగరాల్లో పెట్రో ధరలు గత 16 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో శనివారం పెట్రోల్ ధర 93.99 వద్ద, డీజిల్ ధర 88.05 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.ఇక విజయవాడలోనూ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 96.75 వద్ద ,డీజిల్ ధర 90.27 వద్ద నిలకడగా వున్నాయి. రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 56 పైసలుగా వుండగా డీజిల్ ధర 80 రూపాయల 87 పైసలు వద్దకి చేరింది.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.34 శాతం తగ్గుదలతో 66.71 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.6 శాతం క్షీణతతో 63.08 డాలర్లకు తగ్గింది.