మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెంపు
Petrol and Diesel Price Hike: హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.113.61, డీజిల్ రూ.99.83
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెంపు
Petrol and Diesel Price Hike: దేశంలో పెట్రో వడ్డన కొనసాగుతోంది. ఇవాళ లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెరిగింది. గడిచిన ఎనిమిది రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది ఏడోసారి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయల 61 పైసలు, డీజిల్ ధర 99 రూపాయల 83 పైసలకు చేరింది. దీంతో వారంలో ఇంధన ధరలు పెరగడం ఆరోసారి.
అటు ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలని, ఈ అంశంపై ప్రధాని మోడీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయ్. ఇటు ధరల పెరుగుదలకు రష్యా- ఉక్రెయిన్ యుద్ధమే కారణమన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చాయి. ఇక ధరల పెరుగుదలతో సాధారణ ప్రజలు, వేతన జీవుల జేబులు గుల్లవుతున్నాయని కాంగ్రెస్, డీఏంకే, టీఎంసీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ధరల పెరుగుదలకు ఎప్పుడు పుల్‌స్టాప్ పడుతుందో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.