Paytm: పేటీఎం యూజర్స్‌కి గుడ్‌న్యూస్‌.. చెల్లింపులు ఇప్పుడు మరింత సులభం..

Paytm: పేటీఎం యూజర్స్‌కి గుడ్‌న్యూస్‌.. చెల్లింపులు ఇప్పుడు మరింత సులభం..

Update: 2022-02-11 06:46 GMT

Paytm: పేటీఎం యూజర్స్‌కి గుడ్‌న్యూస్‌.. చెల్లింపులు ఇప్పుడు మరింత సులభం..

Paytm: పేటీఎం యూజర్స్‌కి ఇది గుడ్‌న్యూస్ అని చెప్పాలి. సరికొత్త ఫీచర్ ద్వారా చెల్లింపులు మరింత సులభం చేసింది.ఈ కొత్త ఫీచర్‌కి ట్యాప్ టు పే అని పేరు. దీంతో మొబైల్ ఫోన్‌ల నుంచి కాంటాక్ట్‌లెస్ కార్డ్ చెల్లింపులను చేయగలరు. ఈ ఫీచర్ కింద వినియోగదారులు వారి ఫోన్‌ను PoS (పాయింట్ ఆఫ్ సేల్) మెషీన్‌లో మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే చెల్లింపు పూర్తవుతుంది. ఇందులో వినియోగదారులు తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని పేటీఎం యాప్‌లో లింక్ చేయాలి. తర్వాత PoS మెషీన్‌లో మీ మొబైల్ ఫోన్‌ను ట్యాప్ చేసినప్పుడు ఆ లింక్ చేయబడిన కార్డ్ నుంచి చెల్లింపులు జరుగుతాయి.

ఈ ఫీచర్‌ గురించి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. చెల్లింపులు చేయడానికి ఇంటర్నెట్‌ అవసరం లేదు. వాస్తవానికి మొబైల్ నెట్‌వర్క్ సమస్య ఉన్న ప్రాంతాలలో ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. PoS మెషీన్‌లను ఉపయోగించే దుకాణాలు, షోరూమ్‌లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్‌లు, హోటళ్లు, పెట్రోల్ పంపులు, కిరాణా దుకాణాలు మొదలైన వాటిలో సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ ఫీచర్‌తో దాదాపు రూ. 5000 వరకు చెల్లింపులు జరుపవచ్చు. రూ.5000 కంటే ఎక్కువ చెల్లింపులు చేయడానికి మీరు మీ కార్డ్ పిన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ముందుగా మొబైల్‌లో పేటీఎం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓపెన్ చేసి చెల్లించడానికి ట్యాప్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు పేటీఎం యాప్‌తో ఏదైనా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని లింక్ చేయండి. నిబంధనలు, షరతులను అంగీకరించి OTP కోసం అడగండి. దానిని నమోదు చేయండి. తర్వాత, మీ మొబైల్ ఫోన్‌లో ట్యాప్ టు పే ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. చెల్లించడానికి ముందుగా NFCని ప్రారంభించండి. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్‌ను PoS మెషీన్ దగ్గరకు తీసుకెళ్లండి. చెల్లింపు పూర్తయ్యే వరకు మీరు మీ మొబైల్ ఫోన్‌ను PoS మెషీన్ దగ్గర ఉంచాలని మరిచిపోకండి. 

Tags:    

Similar News