పాన్‌తో ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు.. ఆధార్-పాన్ లింక్ చేయడం ఎలా..?
PAN-Aadhaar: పాన్‌తో ఆధార్‌ను అనుసంధానానికి సంబంధించిన గడువును మరోసారి కేంద్రం పొడిగించింది.
పాన్‌తో ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు.. ఆధార్-పాన్ లింక్ చేయడం ఎలా..?
PAN-Aadhaar: పాన్‌తో ఆధార్‌ను అనుసంధానానికి సంబంధించిన గడువును మరోసారి కేంద్రం పొడిగించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా.. జూన్ 30 వరకు పొడించింది. ఇప్పటికే పలుసార్లు గడువు పొడిగిస్తూ వస్తున్న ఆర్థికశాఖ మరోసారి అవకాశం ఇచ్చింది. పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇచ్చే ఉద్దేశంతో గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తెలియజేసింది. నిర్దేశిత గడువులోగా పాన్- ఆధార్ అనుసంధానం పూర్తి చేయకుంటే జులై 1 నుంచి పాన్ నిరుపయోగంగా మారనుంది.
ఆధార్-పాన్ లింక్ చేయడం ఎలా..?
ముందుగా ఆదాయపు పన్ను వెబ్‌సైట్ కి వెళ్లండి.
ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ను తెరిచిన తర్వాత ఆధార్ లింక్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత మీ స్క్రీన్‌పై కొత్త పేజీ తెరవబడుతుంది.
ఇప్పుడు ఇక్కడ మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలతో పాటు మీ పేరు, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత I Validate my Aadhaar వివరాలను క్లిక్ చేసి కొనసాగించండి.