OYO: ఓయో ఇక హోటల్స్ మాత్రమే కాదు.. ఇల్లు కూడా అద్దెకు ఇస్తుంది
OYO: ప్రముఖ హాస్పిటాలిటీ టెక్ సంస్థ ఓయో (OYO) తన వ్యాపారాన్ని కేవలం హోటల్స్‌కే పరిమితం చేయకుండా ఇప్పుడు వెకేషన్ హోమ్స్, అద్దె గృహాల మార్కెట్‌లోకి దూసుకుపోతోంది.
OYO: ఓయో ఇక హోటల్స్ మాత్రమే కాదు.. ఇల్లు కూడా అద్దెకు ఇస్తుంది
OYO: ప్రముఖ హాస్పిటాలిటీ టెక్ సంస్థ ఓయో (OYO) తన వ్యాపారాన్ని కేవలం హోటల్స్‌కే పరిమితం చేయకుండా ఇప్పుడు వెకేషన్ హోమ్స్, అద్దె గృహాల మార్కెట్‌లోకి దూసుకుపోతోంది. ఈ భారీ విస్తరణలో భాగంగా ఓయో వెకేషన్ హోమ్ మేనేజ్‌మెంట్ యూనిట్ బెల్‌విల్లా బై ఓయో (Belvilla by OYO), ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ షార్ట్-టర్మ్ రెంటల్ ప్లాట్‌ఫామ్ మేడ్‌కామ్‌ఫీ (MadeComfy)ని కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ఓయో ప్రపంచవ్యాప్త విస్తరణ లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
మేడ్‌కామ్‌ఫీ కొనుగోలు ఒప్పందం నగదు, స్టాక్ (షేర్లు) రెండింటి మిశ్రమంతో జరిగింది. ఓయో మాతృ సంస్థ ఒరావెల్ స్టేస్ (Oravel Stays) ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ మీటింగ్ (EGM)లో ఈ డీల్‌కు పూర్తి ఆమోదం లభించింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ కొనుగోలులో ఓయో సుమారు 1.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ.16 కోట్లు) విలువైన షేర్లను జారీ చేస్తుంది. ఒక్కో షేరు విలువ సుమారు 0.67 డాలర్లు (సుమారు రూ.57)గా అంచనా వేశారు. ఈ ఆధారంగా ఓయో ప్రస్తుత విలువ సుమారు 5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.42,500 కోట్లు)గా ఉంది.
ఇది మాత్రమే కాదు, ఒప్పందంలో భాగంగా, రెండు సంవత్సరాల తర్వాత ఓయో అదనంగా 9.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.81 కోట్లు) విలువైన షేర్లను మేడ్‌కామ్‌ఫీకి చెల్లిస్తుంది. కొంత నగదు చెల్లింపు కూడా జరుగుతుంది. అయితే దాని వివరాలు ఇంకా వెల్లడించలేదు.
సబ్రినా బెథునిన్, క్విరిన్ ష్వైఘోఫర్ 2015లో ప్రారంభించిన మేడ్‌కామ్‌ఫీ కంపెనీ ఆస్ట్రేలియాలో 1,200కు పైగా ఆస్తులను (ప్రాపర్టీస్) నిర్వహిస్తోంది. సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్‌లలో దీని కార్యాలయాలు ఉన్నాయి. అంతేకాకుండా, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, వెల్లింగ్‌టన్, హామిల్టన్ వంటి నగరాల్లో కూడా ఈ కంపెనీ సేవలు అందిస్తోంది. 2024లో మేడ్‌కామ్‌ఫీ దాదాపు 9.6 మిలియన్ డాలర్ల రెవెన్యూను నమోదు చేసింది.
మేడ్‌కామ్‌ఫీ ప్రధానంగా స్వల్పకాలిక అద్దె ప్రాపర్టీల నిర్వహణ సేవలను అందిస్తుంది. ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు తమ ఆస్తుల నుండి మెరుగైన ఆదాయాన్ని పొందడంలో ఈ కంపెనీ సహాయపడుతుంది. ఈ కొనుగోలు ద్వారా ఓయోకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి బలమైన మార్కెట్‌లలోకి సులభంగా ప్రవేశం లభించింది.
ఓయో అంతర్జాతీయంగా విస్తరింపజేయడంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. 2019లో ఓయో యూరోపియన్ లీజర్ గ్రూప్‌ను కొనుగోలు చేసింది. అందులో భాగంగానే బెల్‌విల్లా బ్రాండ్ కూడా ఓయో సొంతమైంది. అప్పటి నుండి ఈ యూనిట్‌ను "బెల్‌విల్లా బై ఓయో" పేరుతో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బెల్‌విల్లా 20 యూరోపియన్ దేశాలలో 50,000 కంటే ఎక్కువ హాలిడే హోమ్స్‌ను కలిగి ఉంది.
ఇటీవల, 2024 డిసెంబర్‌లో ఓయో G6 హాస్పిటాలిటీని 525 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దీని ద్వారా ఓయోకు అమెరికా, కెనడాలలో 1,500 కంటే ఎక్కువ ఫ్రాంచైజ్ హోటల్స్ లభించాయి. ఈ విధంగా ఓయో ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారాన్ని నిరంతరం విస్తరిస్తూ హాస్పిటాలిటీ రంగంలో ఒక కీలక శక్తిగా ఎదుగుతోంది.