పిల్లల పేరుపై ఈ ప్రభుత్వ స్కీమ్‌ని ప్రారంభిస్తే అత్యధిక లాభాలు..!

పిల్లల పేరుపై ఈ ప్రభుత్వ స్కీమ్‌ని ప్రారంభిస్తే అత్యధిక లాభాలు..!

Update: 2022-10-12 12:30 GMT

పిల్లల పేరుపై ఈ ప్రభుత్వ స్కీమ్‌ని ప్రారంభిస్తే అత్యధిక లాభాలు..!

Public Provident Fund: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది ఒక చిన్న పొదుపు పథకం. ఇది సాధారణ ప్రజలకి మెరుగైనదిగా చెప్పవచ్చు. ఈ పథకాన్ని సమీపంలోని పోస్టాఫీసులో ప్రారంభించవచ్చు. PPFలో మెచ్యూరిటీ 15 సంవత్సరాలు. దీర్ఘకాలిక పెట్టుబడి పొదుపులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. భవిష్యత్తులో పిల్లల పేరుపై మంచి ఫండ్‌ క్రియేట్‌ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ పథకం వల్ల పిల్లలు పెద్దయ్యాక మంచి నిధిని పొందుతారు. ఇది ఉన్నత విద్య, ఉద్యోగం వంటి లక్ష్యాలని చేరుకోవడంలో సహాయపడుతుంది.

పీపీఎఫ్‌ ద్వారా పన్ను ఆదా కూడా చేయవచ్చు. సెక్షన్ 80C కింద సంవత్సరానికి 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకంలో పొందే వడ్డీ, మెచ్యూరిటీపై ఎటువంటి పన్ను ఉండదు. పిల్లల పేరుతో తెరిచిన ఖాతాపై లోన్‌ సౌకర్యం, కొంత మొత్తం డబ్బులు విత్‌డ్రా చేయవచ్చు. పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ 15 ఏళ్లు. కానీ ముందస్తు నోటీసుతో మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఈ ఖాతాలో సంవత్సరానికి కనిష్టంగా రూ.500, గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టే సదుపాయం ఉంటుంది.

గరిష్ట నెలవారీ డిపాజిట్ రూ.12,500 గరిష్ట వార్షిక డిపాజిట్ రూ.1,50,000. సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ, 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీపై రూ. 40,68,209 లభిస్తుంది.

5 సంవత్సరాల పొడిగింపుపై

గరిష్ట నెలవారీ డిపాజిట్ రూ.12,500 గరిష్ట వార్షిక డిపాజిట్ రూ.1,50,000. సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ. 20 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీపై రూ.66.58 లక్షలు లభిస్తాయి. పెట్టుబడి 30 లక్షలు, వడ్డీ ప్రయోజనం రూ.36.58 లక్షలు అవుతుంది.

Tags:    

Similar News