Ola-Uber: రద్దీ ఉంటే రేట్లు పెంచుకోవచ్చు.. క్యాబ్‌ సంస్థలకు కేంద్రం గుడ్‌ న్యూస్‌

Ola-Uber: ఆన్ లైన్ క్యాబ్ సర్వీసుల రేట్లు త్వరలో పెరగనున్నాయి.

Update: 2025-07-02 06:32 GMT

Ola-Uber: రద్దీ ఉంటే రేట్లు పెంచుకోవచ్చు.. క్యాబ్‌ సంస్థలకు కేంద్రం గుడ్‌ న్యూస్‌

Ola-Uber: ఆన్ లైన్ క్యాబ్ సర్వీసుల రేట్లు త్వరలో పెరగనున్నాయి. పీక్ అవర్స్‌లో ఓలా, ర్యామిడో, ఊబర్ వంటి ఆన్ లైన్ క్యాంబ్ సర్వీసుల ఛార్జీలు రెండు రెట్లు అధికమవనున్నాయి. వివరాల్లోకి వెళితే..

రాబోయే మూడు నెలల్లో ఆన్ లైన్ క్యాబ్ సర్వీసులు అందించే సంస్థలు పీక్ అవర్స్‌లో రేట్లు పెచ్చుకోవచ్చని తాజాగా కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఛార్జీలు గరిష్టంగా 2 రెట్లు వరకు పెంచడానికి అనుమతి వచ్చింది. ఇప్పటివరకు ఈ సర్జ్ ప్రైసింగ్ గరిష్ట పరిమితి 1.5 రెట్లు వరకు ఉండేది. దీన్ని తాజాగా ఇప్పుడు 0.5 రెట్లుకు పెంచారు.

ఎంవీఏజీ 2025, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ మార్గదర్శకాలు ఆన్ లైన్ క్యాబ్ అగ్రిగేటర్లకు కొన్ని నియమాలను నిర్ధేశిస్తాయి. ఈ మార్గదర్శకాల ప్రకారం పీక్ అవర్స్‌లో క్యాబ్ చార్జీలు 2 రెట్లు వరకు పెరగవచ్చు. అంటే సాధారణ సమయాల్లో ఉన్న ఛార్జీల కంటే పీక్ అవర్స్‌లో రెట్టింపు రేటుతో ఇక ప్రయాణికులు ప్రయాణించవలసి ఉంటుంది. ఈ ఛార్జీల పెంపును రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాయి.

దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి లోబడి ఆన్ లైన్ క్యాబ్ అగ్రిగేటర్ల ద్వారా ప్రయాణాలకు ప్రయివేట్ మోటార్ సైకిళ్లను ఉపయోగించడానికి అనుమతిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, వాహన కాలుష్యాన్ని కట్టడి చేయడం, హైప్ లోకల్ డెలివరీకి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర వేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఎంవీఏజీ 2025 మార్గదర్శకాల ప్రకారం కంపెనీ నుంచి రోజువారీ, వారం వారీ, లేదా 15 రోజులకు ఒకసారి ఫీజు వసూలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది.

మరికొన్ని మార్గదర్శకాలు

పీక్ అవర్స్‌ కాని సమయంలో బేజ్ ఛార్జీలో కనీసం 50% ఫేర్ ఉండాలి.

పిక్ దూరం 3 కిమీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే డెడ్ మైలేజ్ ఛార్జీలు విధించాలి.

డ్రైవర్ కారణం లేకుండా రైడ్ క్యాన్సిల్‌ చేస్తే రూ.100 లేదా 10% ఛార్జీని విధిస్తారు. అంతేకాదు ఎవరైనా స్వయంగా క్యాన్సిల్ చేసుకున్నా కూడా ఇక ఇదే వర్తిస్తుంది.

ఇక భద్రతా చర్యల విషయానికొస్తే రైడ్ వాహనాలకు స్టేట్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానించిన లొకేన్ ట్రాకింగ్ పరికరాలు ఉండాలి.

Tags:    

Similar News