Bank Fraud: ఒక్క ఫోన్‌కాల్‌ మీ ఖాతా ఖాళీ చేయగలదు..! ఈ సమాచారం తెలుసుకోండి..

*ఆధునిక సమాజంలో టెక్నాలజీ పెరిగిపోవడంతో అన్ని లావాదేవీలు ఇప్పుడు ఇంటర్‌నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరుగుతున్నాయి.

Update: 2021-11-24 07:30 GMT

ఒక్క ఫోన్‌కాల్‌ మీ ఖాతా ఖాళీ చేయగలదు..!

Bank Fraud:ఆధునిక సమాజంలో టెక్నాలజీ పెరిగిపోవడంతో అన్ని లావాదేవీలు ఇప్పుడు ఇంటర్‌నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరుగుతున్నాయి. ఇది శుభపరిణామమే అయినా అంతే లెవల్‌లో సైబర్‌ దాడులు కూడా పెరిగిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క ఫోన్‌ కాల్‌ మీ ఖాతాని ఖాళీ చేయగలదు. అందుకే అపరిచిత కాల్స్‌ని డైవర్ట్ చేయడం మంచిది. లేదంటే ఆర్థికంగా దెబ్బతినాల్సి వస్తుంది.

సైబర్‌ నేరస్థుడు ఫోన్ కాల్ ద్వారా మీ నుంచి వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. ఇందులో యూజర్ ఐడి, లాగిన్, ట్రాన్సాక్షన్ పాస్‌వర్డ్, OTP, URN, కార్డ్ పిన్ నెంబర్, CV లేదా పుట్టిన తేదీ, తల్లి పేరు మొదలైన ఏదైనా ఇతర వ్యక్తిగత వివరాలను అడగవచ్చు. ఈ సమాచారం బ్యాంక్‌ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తారు. అయితే ఎప్పుడైనా బ్యాంకు అధికారులు ఇలాంటి వివరాలను అడగరని కస్టమర్లు గుర్తుంచుకోవాలి.

ఎలా నివారించాలి?

1. మీ వ్యక్తిగత సమాచారంలో కొన్ని వివరాలు బ్యాంక్‌కి ముందు తెలుసు. అయినా వివరాలు తెలుసుకోవడానికి ఫోన్‌ కాల్‌ వస్తే వెంటనే బ్యాంకు అధికారులకు తెలియజేయండి.

2. ఫోన్‌లో మెస్సేజ్‌ ద్వారా వ్యక్తిగత లేదా ఖాతా వివరాలను అడిగితే ఎప్పుడూ ఇవ్వవద్దు. ఆ నెంబర్‌కి ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయవద్దు. ఈ మెయిల్ లేదా SMS ద్వారా పంపిన నంబర్‌ను సంప్రదించవద్దు.

3. ఒకవేళ మీరు చెక్‌ చేయాలనుకుంటే చేయవలసిన మొదటి పని మీ క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్ వెనుక ఉన్న ఫోన్ నంబర్‌కు కాల్ చేయడం. వచ్చిన నంబర్ వాస్తవానికి బ్యాంక్ నుంచి వచ్చినదా కాదా అని తెలుస్తుంది.

Tags:    

Similar News