Nvidia: ఆపిల్, మైక్రోసాఫ్ట్‌లు కూడా దీని ముందు దిగదుడుపే.. తొలి $4 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ కంపెనీగా రికార్డ్
Nvidia: ఎన్విడియా షేర్లు బుధవారం 2శాతం కంటే ఎక్కువ పెరగడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ $4 ట్రిలియన్లు (సుమారు రూ.334 లక్షల కోట్లు) దాటింది.
Nvidia: ఆపిల్, మైక్రోసాఫ్ట్‌లు కూడా దీని ముందు దిగదుడుపే.. తొలి $4 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ కంపెనీగా రికార్డ్
Nvidia: ఎన్విడియా షేర్లు బుధవారం 2శాతం కంటే ఎక్కువ పెరగడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ $4 ట్రిలియన్లు (సుమారు రూ.334 లక్షల కోట్లు) దాటింది. ఇంత భారీ మార్కెట్ విలువను సాధించిన మొదటి కంపెనీ ఇదే. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కి కీలకమైన హార్డ్‌వేర్‌ను ఎన్విడియా తయారు చేస్తుండడంతో పెట్టుబడిదారులు భారీగా దాని షేర్లను కొనుగోలు చేశారు. ఈ ఘనతను సాధించిన ఎన్విడియా, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలను కూడా వెనక్కి నెట్టింది. అంతకుముందు డిసెంబర్‌లో ఆపిల్ అతిపెద్ద మార్కెట్ క్యాప్‌ను సాధించింది. కానీ ఇప్పుడు ఎన్విడియా ఆ రికార్డును బద్దలు కొట్టింది. మైక్రోసాఫ్ట్, ఎన్విడియాకు పెద్ద కస్టమర్లలో ఒకటి.
కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న ఎన్విడియా కంపెనీ 1993లో స్థాపించబడింది. కంపెనీ ఫిబ్రవరి 2024లో $2 ట్రిలియన్, జూన్‌లో $3 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ మైలురాళ్లను అధిగమించింది. 2022 చివరిలో ChatGPT ప్రారంభమైన తర్వాత AI హార్డ్‌వేర్, చిప్స్‌కు భారీ డిమాండ్ పెరగడంతో ఎన్విడియా ఈ విజయాన్ని సాధించింది. AI, బహు భాషా మోడళ్లను నడిపే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ (GPUs) ను తయారు చేసే అతిపెద్ద సంస్థగా ఎన్విడియా నిలిచింది.
గత 5 సంవత్సరాలలో ఎన్విడియా షేర్లు 15 రెట్లు పెరిగాయి. గత నెలలో దాని షేర్లు 15శాతం పెరిగాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటివరకు 22శాతం వృద్ధి నమోదైంది. ఇటీవలి ఎన్విడియా షేర్ల వృద్ధి చైనాతో సంబంధిత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చిప్ అమ్మకాలపై ఉన్న ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో చైనాలోని డీప్‌సీక్ మోడల్, భవిష్యత్తులో AIకి అంతగా చిప్స్ అవసరం ఉండదని ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఎన్విడియా దీనిని కూడా అధిగమించింది.
మే నెలలో ఎన్విడియా, చైనా కోసం తయారు చేసిన H20 చిప్స్‌పై విధించిన కొత్త ఎగుమతి ఆంక్షల వల్ల కంపెనీకి $8 బిలియన్ల నష్టం వాటిల్లవచ్చని తెలిపింది. ఎన్విడియా సీఈఓ జైన్సన్ హువాంగ్ ఆ సమయంలో మాట్లాడుతూ.. "చైనాలో $50 బిలియన్ల మార్కెట్ ఇప్పుడు అమెరికన్ కంపెనీలకు దాదాపు మూసివేయబడింది" అని అన్నారు. ఎన్విడియా చైనాలో చిప్స్ అమ్మడం ఆపివేస్తే, అది కంపెనీకి భారీ నష్టం అవుతుందని ఆయన మీడియాకి తెలిపారు.