PPF Rules: పీపీఎఫ్ ఖాతాదారులకి గమనిక.. మెచ్యూరిటీకి ముందే డబ్బు తీసుకోవడం ఎలా..?

PPF Rules: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(Public Provident Fund) అనేది ఒక గొప్ప ప్రభుత్వ పథకం...

Update: 2022-04-19 10:30 GMT

PPF Rules: పీపీఎఫ్ ఖాతాదారులకి గమనిక.. మెచ్యూరిటీకి ముందే డబ్బు తీసుకోవడం ఎలా..?

PPF Rules: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(Public Provident Fund) అనేది ఒక గొప్ప ప్రభుత్వ పథకం. ఇందులో ప్రజలు పెద్ద సంఖ్యలో పెట్టుబడి పెడతారు. ఈ పథకం కింద మీరు బ్యాంక్ లేదా పోస్టాఫీసు(Post Office)లో ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ప్రభుత్వం 7.1 శాతం రాబడిని ఇస్తుంది. ఈ పథకం లాక్-ఇన్ వ్యవధి 15 సంవత్సరాలు. దీనిని మరో 5 సంవత్సరాలు పొగించుకునే అవకాశం ఉంటుంది.

కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల లాక్-ఇన్ పీరియడ్(Lock-in Period) కంటే ముందే PPF నుంచి డబ్బును విత్‌డ్రా చేయాల్సి ఉంటుంది. మీరు ముందుగా ఖాతాను మూసివేయవచ్చు. కాబట్టి PPF ఖాతా నుంచి ముందుగానే డబ్బుని విత్‌ డ్రా(Withdraw) చేయాలంటే కొన్ని నియమాల గురించి తెలిసి ఉండాలి. నిబంధనల ప్రకారం, మీరు 2022 లో PPF ఖాతాను తెరిచి ఉంటే మీరు కనీసం ఐదేళ్లలోపు దాని నుంచి డబ్బును విత్‌డ్రా చేయలేరు. కానీ మీరు కొన్ని పరిస్థితులలో డబ్బును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

15 ఏళ్లు నిండకుండానే పీపీఎఫ్ ఖాతాలోని మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదంటే పాక్షికంగా కూడా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. నిబంధనల ప్రకారం ఖాతా తెరిచిన ఐదేళ్లలోపు ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తారు. దీంతో పాటు ఈ ఖాతాలో మీకు రుణ సౌకర్యం కూడా ఉంటుంది. కానీ డిపాజిట్(Deposite) మొత్తంలో 50 శాతం వరకు మాత్రమే రుణాన్ని పొందుతారు. దీంతో పాటు ఈ పథకం కింద జమ చేసిన డబ్బుపై పన్ను ఉండదు. 15 సంవత్సరాల వ్యవధి పూర్తయిన తర్వాత మీరు ఖాతాలో జమ చేసిన డబ్బులో 100% విత్‌డ్రా చేసుకోవచ్చు.

Tags:    

Similar News