Nokia G20 Price in India: తక్కువ ధరకే నోకియా సరికొత్త ఫోన్

Update: 2021-07-06 11:41 GMT

Nokia G20  Specifications and Features

Nokia G20 Price in India: నోకియా 'కనెక్టింగ్ ది పీపుల్' ఒక రెండు దశాబ్ద కాలం క్రిందట ఆ ప్రముఖ కంపెనీకి మొబైల్ వినియోగదారుల్లో ఉన్న క్రేజ్ వేరు. కాలక్రమేనా టెక్నాలజీ పెరుగుతుండడంతో పాటు మొబైల్ సంస్థల నుండి పోటీ కూడా పెరగడంతో వినియోగదారులకి కావాల్సిన ఫీచర్స్ ను నోకియా సంస్థ అందిచలేక కాస్త వెనుకబడిపోయింది. కేవలం విండోస్ పై పూర్తిగా ఆధారపడిన నోకియా సంస్థ తర్వాత ఆండ్రాయిడ్ లోను మొబైల్ ఫోన్స్ ని నెమ్మదినెమ్మదిగా వినియోగదారులకి అందుబాటులోకి తెస్తుంది. తాజాగా ఈ సంస్థ భారత మార్కెట్ లోకి నోకియా జి 20 మోడల్ ఫోన్ ని విడుదల చేసింది. పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో ఉండటానికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో ఈ ఫోన్ ని మంగళవారం నుండి అమ్మకానికి పెట్టారు.

హావ్ మై డేటా గ్లోబల్ (ఎచ్ఎండి) సంస్థ నుండి వచ్చే మొబైల్స్ లో ఇది తక్కువ బడ్జెట్ మొబైల్ ఫోన్ అని తెలిపారు. భారత మార్కెట్ లో ఈ మొబైల్ ధర సుమారుగా 13 వేల వరకు ఉండనుంది. ఈ మొబైల్ లో 4 జిబి ర్యామ్ తో పాటు 64జిబి,128జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజి ఇవ్వనుంది. 6.5 అంగుళాల హెచ్ డి స్క్రీన్ తో పాటు 20:9 రేషియో, 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా తో పాటు 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే 5050 మిల్లి అమ్పెర్ కెపాసిటీ ఉండబోతుంది. గతంలో నోకియా హావ్ మై డేటా గ్లోబల్ నుండి నోకియా సి10, నోకియా సి20, నోకియా ఎక్స్10, నోకియా ఎక్స్20, నోకియా జి10 వంటి స్మార్ట్ ఫోన్ మోడల్స్ ని వినియోగదారులకి అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం విడుదల చేస్తున్న మోడల్స్ నుండి నోకియా కూడా మరో మారో మొబైల్ ఫోన్ అమ్మకాలలో ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీని ఇవ్వనుంది.

Tags:    

Similar News