New Income Tax Slabs: రూ. 12 లక్షల ఆదాయం వరకు ఆదాయపన్ను లేదు... కొత్త శ్లాబ్స్ ఇవే..!

Income Tax Slabs 2025: రూ. 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2025-02-01 06:54 GMT

Income Tax Slabs 2025: రూ. 12 లక్షల వరకు నో ఇన్‌కమ్ ట్యాక్స్

ncome Tax Slabs 2025: రూ. 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర బడ్జట్ 2025-26 కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగం ప్రకారంగా ఇక నుంచి రూ. 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.

రూ.0-4 లక్షల ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను లేదు. రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు 5 శాతం పన్ను విధించనున్నారు. రూ.8లక్షల నుంచి 12 లక్షల వరకు 10 శాతం పన్ను వేస్తారు. రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షల ఆదాయం ఉన్న వారికి 15 శాతం ట్యాక్స్ వసూలు చేస్తారు. రూ 16 నుంచి 20 లక్షల వరకు 20 శాతం పన్ను విధిస్తారు.

కొత్త పన్నుల శ్లాబులు



Tags:    

Similar News