Multibagger Stock: రూ.లక్ష పెట్టుబడి పెడితే.. చేతికి రూ.10 లక్షలు! ఏం షేరురా బాబూ.. డబ్బుల వర్షం కురిపించింది
రట్టన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ షేర్లు మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. మంగళవారం కంపెనీ షేర్ ధర ఒక్కసారిగా 10% లాభంతో నాలుగు వారాల గరిష్టానికి చేరింది. భారీ వాల్యూమ్, ఈవీ డిమాండ్ పెరగడంతో స్టాక్‌లో ఉత్సాహం నెలకొంది.
Multibagger Stock: రూ.లక్ష పెట్టుబడి పెడితే.. చేతికి రూ.10 లక్షలు! ఏం షేరురా బాబూ.. డబ్బుల వర్షం కురిపించింది
రట్టన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ షేర్లు మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. మంగళవారం కంపెనీ షేర్ ధర ఒక్కసారిగా 10% లాభంతో నాలుగు వారాల గరిష్టానికి చేరింది. భారీ వాల్యూమ్, ఈవీ డిమాండ్ పెరగడంతో స్టాక్‌లో ఉత్సాహం నెలకొంది. ఉదయం 2.30 గంటల వరకు NSE, BSEలో 72.8 మిలియన్ల షేర్లు ట్రేడ్ అవ్వగా.. ఇది సగటు వారంత వాల్యూమ్ కంటే 27 రెట్లు ఎక్కువ.
ఇన్వెస్టర్లలో హైప్ రావడానికి కారణం.. రివోల్ట్ మోటార్స్ ఆగస్టులో బుకింగ్స్‌లో భారీ డిమాండ్ సాధించడం. ‘అజాదీ ఫ్రమ్ పెట్రోల్’ ఆఫర్‌తో పాటు ₹20,000 వరకు ప్రయోజనాలు ఇవ్వడంతో డిమాండ్ పెరిగింది. AI- ఎలక్ట్రిక్ మోడల్స్‌పై ఇన్సూరెన్స్ ఫీజు లేకుండా అదనపు సేవింగ్స్ కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
రివోల్ట్ RV400, RV400 BRZ, RV1, RV1+, RV BlazeX మోడల్స్‌ను ఇండియన్ రైడర్స్ కోసం డిజైన్ చేసింది. తక్కువ రన్నింగ్ ఖర్చు, స్మార్ట్ రైడింగ్ మోడ్స్, కనెక్టెడ్ టెక్నాలజీతో ఈ బైక్స్ ప్రస్తుతం 200కి పైగా నగరాల్లో డిమాండ్ సాధిస్తున్నాయి.
2023 జనవరిలో రట్టన్ ఇండియా, రివోల్ట్‌లో 100% వాటా కొనుగోలు చేసి ఉత్పత్తి రెండింతలు చేసింది. ఇప్పుడు 185 నగరాల్లో 211 స్టోర్లతో పాన్ ఇండియా ప్రెజెన్స్ కలిగింది. ఇటీవలే 50,000వ ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేసి మరో మైలురాయిని చేరుకుంది. FY25లో 12,322 యూనిట్లు విక్రయించి, FY24తో పోలిస్తే 56% వృద్ధి సాధించింది.
గత ఐదు సంవత్సరాల్లో కంపెనీ షేర్ ధర దాదాపు 900% పెరిగింది. అంటే అప్పట్లో రూ.లక్ష పెట్టిన ఇన్వెస్టర్లకు ఇప్పుడు రూ.10 లక్షలు చేతికి వచ్చాయి. అయితే Q1FY26లో కంపెనీ నికర లాభం ₹502 కోట్లకు తగ్గింది. అదే సమయంలో ఆపరేషన్స్ నుండి రాబడి ₹2,313 కోట్లు నమోదైంది. వీటిలో ఎక్కువ ఆదాయం ఈ-కామర్స్ బిజినెస్ నుంచి వచ్చింది.
డిస్క్లైమర్: ఇది కేవలం సమాచారార్థం మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువ. పెట్టుబడులు పెట్టేముందు ఎక్స్పర్ట్స్ సలహా తీసుకోవాలి.