Campa Cola: ఇప్పుడు దుబాయ్ లో కూడా అంబానీ సాఫ్ట్ డ్రింక్.. ధర ఎంతో తెలుసా ?

Campa Cola: భారతదేశంలో సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్‌లో ముఖేష్ అంబానీ కాంపా కోలా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Update: 2025-02-19 09:43 GMT

Campa Cola: ఇప్పుడు దుబాయ్ లో కూడా అంబానీ సాఫ్ట్ డ్రింక్.. ధర ఎంతో తెలుసా ?

Campa Cola: భారతదేశంలో సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్‌లో ముఖేష్ అంబానీ కాంపా కోలా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంపా కోలా దుబాయ్‌లో తన మ్యాజిక్‌ను చూపించేందుకు సిద్ధంగా ఉంది. ఆసియాలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ వ్యాపార ప్రపంచంలో నిరంతరం కొత్త వ్యాపారాలతో ముందుకు సాగుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ FMCG యూనిట్ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తన శీతల పానీయాల బ్రాండ్ కాంపా కోలాను దుబాయ్ లో ప్రారంభించింది. భారత శీతల పానీయాల మార్కెట్‌ను ఇప్పటి వరకు ఏలిన బ్రాండ్లకు కాంపా కోలా రాకతో కష్టకాలం మొదలైంది. దుబాయ్‌లో కాంపా కోలాని ప్రారంభించిన తర్వాత, పానీయాల పరిశ్రమలోని పెద్ద కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది.

దుబాయ్‌లో రిలయన్స్ అఘియా గ్రూప్‌తో భాగస్వామ్యంతో కాంపా కోలాను ప్రారంభించింది. ఇది యుఎఇ మార్కెట్లో ముఖేష్ అంబానీ కాంపాకు మొదటి అడుగు. 2022 సంవత్సరంలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కాంపా కోలాను కొనుగోలు చేసిన తర్వాత సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. దీని మార్కెట్ క్యాప్ రూ. 16.57 లక్షల కోట్లు.

దీనిపై కేతన్ మోడీ మాట్లాడుతూ.. “50 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ బ్రాండ్ అయిన కాంపాతో దుబాయ్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. మేము దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడుతున్నాము. ఈ ప్రాంతంలో త్వరిత వృద్ధి కోసం చూస్తున్నాము. వినియోగదారులకు సరసమైన ధరలకు వినూత్నమైన, ప్రపంచ నాణ్యత గల ఉత్పత్తులను అందించడంలో మాకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది” అని చెప్పుకొచ్చారు.

కాంపా కోలా ప్రారంభం యుఎఇ కస్టమర్లలో కొత్త అభిమానులను తీసుకువస్తుందని ఆయన అన్నారు. క్యాంపా కోలా చిన్న బాటిల్ భారతదేశంలో రూ. 10 కి లభిస్తుంది. భారతదేశంలోని ఇతర శీతల పానీయాల కంటే ఇది చౌకైనది. దుబాయ్‌లో ఒక బాటిల్ ధర AED 6.50(రూ.150) నుండి AED 18.40(రూ.435) వరకు ఉంటుంది.


Tags:    

Similar News