Mark Zuckerberg: ఏఐ నిపుణులకు మార్క్ బంపర్ ఆఫర్..సెలెక్ట్ అయితే రూ.860 కోట్లు జీతం
Mark Zuckerberg: ఏఐ నిపుణులకు ఆకట్టుకునేందుకు మెటా సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ బంపర్ ఆఫర్‌ని తీసుకొచ్చారు. ఈ కంపెనీలో సెలెక్ట్ ఉద్యోగులు ఒక్కొక్కరికి రూ.860 కోట్ల రూపాయల ప్యాకేజీని ఆఫర్ చేశారు.

ఈ మధ్య ఎక్కడ చూసినా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే కంపెనీలు కూడా వీటి దారిలోకి వెళ్లి ఏఐ నిపుణులను చేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా టాప్ ఏఐ నిపుణులను ఆకట్టుకునేందుకు ఒక ప్రకటన చేసారు. ఒక్కొక్కరికి 100 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.860 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీని ఆఫర్ చేశారు.
ప్రస్తుతం మెటా సంస్థ సూపర్ ఇంటెలిజెన్స్ పేరుతో అంతర్గతంగా ఒక ఏఐ డవలప్మెంట్ టీంని నడుపుతోంది. ఇందులో భాగం మార్క్, స్వయంగా ఆయనే ల్యాబ్ కోసం రిక్రూట్మెంట్లను నిర్వహించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఇప్పుడు ముగ్గురు ఉద్యోగులను తన సంస్థలో చేర్చుకునేందుకు ఈ ఆఫర్‌ని ప్రకటించారు.
రిక్రూట్మెంట్‌లో భాగంగా మార్క్ తన నివాసంలోనే ఇంటర్వ్యూలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అలాగే వీరి రిక్రూట్మెంట్ తర్వాత ఎక్కడ ఉంచాలనే అంశాలపై కూడా ఆయనే డైరెక్షన్స్ చేస్తున్నట్లు కూడా సమాచారం. అయితే ఇప్పటివరకు ఎంతమంది రిక్రూట్ అయ్యారు అనే విషయం మాత్రం ఎవరికీ స్పష్టంగా తెలియదు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీ మయం అయింది. దీనికి తోడు ఇటీవల కాలంలో ఏఐ వినియోగం కూడా బాగా పెరిగిపోయింది. దీంతో టెక్ కంపెనీల మధ్య తెలియని వార్ ఒకటి నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్క్ ఏఐ నిపుణులకు ఇతర సంస్థలో పనిచేస్తున్న హై టాలెంటెడ్ ఏఐ నిపుణులను ఆకట్టుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటించారు.